Begin typing your search above and press return to search.

ఇసుక వచ్చేస్తోంది .. చేసుకో పనులు ఎంచక్కా !

By:  Tupaki Desk   |   13 Nov 2019 10:37 AM GMT
ఇసుక వచ్చేస్తోంది .. చేసుకో పనులు ఎంచక్కా !
X
రాష్ట్రం లో గత కొన్నిరోజులుగా ఇసుక కొరత భారీ గా పెరిగి పోయింది. గతం లో ఎన్నడూ లేనంత గా ఇసుక కొరత ఏర్పడటం తో .. కొంత మంది కార్మికులు పనిలేక ఆత్మహత్య లు చేసుకున్నారు. దీని పై విపక్షాలు ..ప్రభుత్వం పై తీవ్రమైన ఆరోపణలు చేసాయి. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం లో ఇసుక కొరత అనేదే లేకుండా చేయాలని అధికారులని ఆదేశించారు. ఇందులో భాగం గానే తాజాగా రాష్ట్రం లో ఇసుక అందుబాటు లోకి వచ్చేస్తోందని తెలిపారు

ఇక ఈ గురువారం నుండే ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరకి ఎవరైనా ఇసుక అమ్మితే.. భారీ స్థాయి లో జరిమానా, వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశం లో తీర్మానం చేయబోతున్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకూ ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. గతం లో సగటున 80 వేల టన్నుల ఇసుక డిమాండ్‌ ఉండేది. వరదల కారణంగా రీచ్‌లు మునిగిపోవడంతో ఈ డిమాండ్‌ను చేరుకోలేకపోయాం. గత వారం రోజులు గా పరిస్థితి లో మార్పు వస్తోంది. నదుల్లో ఇసుక తిన్నెలు బయటపడుతున్నాయి అని తెలిపారు.

ప్రస్తుతం లక్షా 20 వేల టన్నుల ఇసుక అందుబాటు లోకి వచ్చింది. రీచ్‌ల సంఖ్య కూడా 60 నుంచి 90 చేరింది. ఇసుక నిల్వలను రెండు లక్షల టన్నులకు తీసుకు రాగలిగితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు అని సీఎం తెలిపారు. ఇసుక రేటు కార్డులను బుధ, గురువారాల్లో ఖరారు చేయాలని సీఎం జేసీలను నిర్దేశించారు. ఇసుక కొరత తీరేంత వరకూ అధికారులెవరూ సెలవులు తీసుకోవద్దు అని , విశ్రాంతి లేకుండా పనిచేయాలి అని అన్నారు. అలాగే సరిహద్దుల్లో ప్రతి చోటా చిన్నా పెద్దా రూట్లలోనూ చెక్‌పోస్టులను , అక్కడే వీడియో కెమెరాలు కూడా పెట్టాలి అని తెలిపాడు. మొత్తంగా ఇసుక ఇప్పుడు అందరికి అందుబాటు లోకి రావడం తో అందరూ పనుల లో మునిగిపోయారు.