Begin typing your search above and press return to search.

ఏపీ ఇసుక కష్టాలు ఇంకా తీరడం లేదా ?

By:  Tupaki Desk   |   22 March 2021 10:30 AM GMT
ఏపీ ఇసుక కష్టాలు ఇంకా తీరడం లేదా ?
X
అధికారపార్టీ నేతలకు ఈ విషయమే అర్ధం కావటంలేదు. ఇసుక రీచులు, అమ్మకం లాంటి అనేక అంశాలను సరైన మార్గంలో పెట్టడంలో ప్రభుత్వం ఫెయిలైనట్లే అనుకోవాలి. గృహనిర్మాణాలకు లేదా ఇతరత్రా అవసరాలకు ఇసుక దొరకక జనాలు నానా అవస్తలు పడుతున్నారు. ఇదే సమయంలో లారీ ఇసుక లేదా ట్రాక్టర్ ఇసుక కొనుగోలు చేయాలంటే మధ్య తరగతి జనాలకు చుక్కలు కనబడుతున్నాయి. లారీ ఇసుక ధర అనధికారికంగా సుమారు 15-25 రూపాయల మధ్య ఉందని జనాలు చెప్పుకుంటున్నారు.

నిజానికి ప్రకృతి సిద్ధంగా దొరికే ఇసుక అమ్మకాలను మొదలుపెట్టింది చంద్రబాబునాయుడు. అప్పట్లో చెప్పింది డ్వాక్రా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని. కానీ ఆర్ధికంగా బలోపేతమైంది టీడీపీ నేతలే అన్న విషయం తెలిసిందే. ఉచితంగా లభించే ఇసుక నుండి కూడా అప్పట్లో టీడీపీ నేతలు కోట్ల రూపాయల దోచేసుకున్నారు. ఈ విషయంలో పార్టీ, ప్రభుత్వంలోనే పెద్ద గొడవలయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన అంశాల్లో ఇసుక వ్యాపారం కూడా ఒకటి.

మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇసుక వ్యాపారాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారని అందరు అనుకున్నారు. ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేసింది. అయితే ఆ ప్రయత్నం దారుణంగా విఫలమైంది. టీడీపీ హయాంలోని ఆరోపణలే ఇపుడు కూడా కంటిన్యు అవుతున్నాయి. అధికారపార్టీ ప్రజా ప్రతినిధులకు ఇసుక రీచులన్నవి కల్పతరువులాగ తయారైందనే ఆరోపణలు మరింతగా పెరిగిపోయింది. దాంతో ఇసుక వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా తయారైంది.

ఇలాంటి తలనొప్పులను వదిలించుకునేందుకు ప్రభుత్వం మొత్తం రీచులను కాంట్రాక్టు పద్దతిన ఢిల్లీలోకి జయప్రకాశ్ వెంచర్స్ కు అప్పగించింది. వెంటనే జయప్రకాశ్ వెంచర్స్ పైన కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు మొదలు పెట్టేశాయి. సరే టీడీపీ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జగన్ ఏమి చేసినా, ఏమీ చేయకపోయినా ఆరోపణలు చేయటమే పనిగా పెట్టుకుంది. టీడీపీ ఆరోపణలను వాళ్ళకు మద్దతిచ్చే మీడియా తప్ప మామూలు జనాలు అసలు పట్టించుకోవటమే లేదు. కాకపోతే జనాలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని జగన్ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడైనా ఇసుక సరఫరాను స్ట్రీమ్ లైన్ చేస్తే జనాలు సంతోషిస్తారు.