Begin typing your search above and press return to search.

ఇసుక గొడవ - మళ్లీ మళ్లీ వివాదాస్పదమే

By:  Tupaki Desk   |   16 May 2022 5:24 AM GMT
ఇసుక గొడవ - మళ్లీ మళ్లీ వివాదాస్పదమే
X
రాష్ట్రంలో ఇసుక త‌వ్వ‌కాలు అమ్మ‌కాలు త‌దిత‌ర ప‌రిణామాల‌కు సంబంధించి వివాదాలు రేగుతున్నాయి. ఇసుక ర్యాంపుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి చెన్న‌య్ కు చెందిన ట‌ర్న్ కీ సంస్థే క‌థంతా న‌డుపుతోంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇది శేఖ‌ర్ రెడ్డి అనే వ్య‌క్తి చేతిలోనే ఉంద‌ని ఆరోపిస్తూ టీడీపీ కీల‌క వ్యాఖ్య‌లు చేస్తోంది. వాస్త‌వానికి ఇసుక త‌వ్వ‌కాల‌కు సంబంధించి తాము ఎంతో పార‌ద‌ర్శ‌కంగా ఉన్నామ‌ని వైసీపీ అంటున్నా అవేవీ నిజం కాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల జేబు సంస్థ‌ల్లో ఒక‌టైన టర్న్ కీ కే అంతా అందుతోంద‌ని ఆరోపిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న శేఖ‌ర్ రెడ్డి మాత్రం త‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని అంటున్నారు. అయితే ఇసుక ర్యాంపుల ద‌గ్గ‌ర ఇవాళ్టికీ న‌గ‌దు లావాదేవీలు అన్నీ ఆన్ క్యాష్ న‌డుస్తున్నాయే కానీ ఎక్క‌డా డిజిట‌ల్ లావాదేవీలు లేనేలేవని అంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు. దీనిపై వెంట‌నే ఎందుక‌ని చ ర్య‌లు తీసుకోలేక‌పోతున్నార‌ని మండిప‌డుతోంది. పేరుకే జేపీ వెంచ‌ర్స్ ఉన్న‌ప్ప‌టికీ క‌థంతా ట‌ర్న్ కీనే న‌డిపిస్తోంద‌ని టీడీపీ ప‌దే ప‌దే ఆరోపిస్తుంది.

మ‌రోవైపు ఇసుక తో పాటు ఇత‌ర మైనింగ్ వ్య‌వ‌హారాల్లోనూ వైసీపీకి వాటాలున్నాయన్న క‌థ‌నాలు మీడియాలో వ‌స్తున్నాయి.వీటిపై కూడా వైసీపీ త‌న‌దైన వివ‌ర‌ణ ఇస్తూ.. వీలున్నంత వ‌ర‌కూ మైనింగ్ త‌వ్వ‌కాలు అన్నీ పార‌దర్శ‌కంగానే సాగుతున్నాయి అని అంటోంది. కానీ జ‌ర‌గుతున్న వాస్త‌వాలు మాత్రం వేరుగా ఉన్నాయని టీడీపీ అంటోంది. మైనింగ్ ప్ర‌క్రియ‌లో కానీ ఇసుక లేదా మ‌ట్టి తవ్వాకాల్లో కానీ తాము ఆధారాల‌తో స‌హా లోపాలు ఎత్తి చూపినా కూడా ప‌ట్టించుకున్న నాథుడే లేడ‌ని మండి ప‌డుతోంది.

విశాఖ నుంచి శ్రీ‌కాకుళం వర‌కూ ఇసుక త‌వ్వ‌కాల‌కు సంబంధించి విశాఖ నుంచి శ్రీ‌కాకుళం వ‌ర‌కూ య‌థేచ్ఛ‌గా సాగిపోతున్నా చీక‌టి ర‌వాణా అయితే ఆగ‌డం లేదు అని నెల‌కు వెయ్యికోట్ల రూపాయ‌ల మేర‌కు దందాలు న‌డిచినా ప‌ట్టించుకున్న వారే లేరని సోష‌ల్ మీడియా లో టీడీపీ గ‌గ్గోలు పెడుతోంది. ఇసుక అమ్మ‌కాల‌పై స‌మగ్ర విధానం పైకి ప్ర‌క‌టన రూపంలో వెల్ల‌డి అయినా లోపల మాత్రం క‌థ వేరేగా ఉంటుంద‌ని ఆరోపిస్తోంది. ఆధారాలు చూపిస్తోంది.

భారీ వాహ‌నాల రూపంలో ఇసుక శ్రీ‌కాకుళం నుంచి విశాఖ‌కు త‌ర‌లిపోతున్నా ఎక్క‌డా నిబంధ‌న‌ల పాటింపు లేద‌ని కూడా తేలిపోయింది అని గ‌గ్గోలు పెడుతోంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో విశాఖ కాస్త ముందంజ‌లో ఉండ‌డంతో ఎన్నడూ లేని విధంగా న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాలు త‌దిత‌ర గ్రామాలు విప‌రీతంగా కోత‌కు గురి అవుతున్నాయి. నిబంధ‌న‌లు దాటి ఇసుక త‌వ్వుతున్న వార్త‌లు క‌థ‌నాలు వెలుగులోకి వ‌చ్చినా కూడా మైనింగ్ శాఖ పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖలాలే లేవు అని తేలిపోయింది.

ఇసుక త‌వ్వ‌కాల‌కు సంబంధించి ఫిర్యాదులు వ‌స్తే అధికారులు త‌రువాత చూద్దాం అన్న విధంగా చెప్పి, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నార‌ని కూడా తెలుస్తోంది. పేప‌ర్ లో వ‌చ్చిన ధ‌ర‌కు అనుగుణంగా ఇసుక ర్యాంపులు న‌డ‌వ‌డం లేదు అని కూడా తేలిపోయింది. సీసీ కెమెరాల అజ్వ‌ర్వేష‌న్ కూడా లేదు. అయినా వీటిపై స‌రైన నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ ను నియ‌మించి,చర్య‌లు వేగ‌వంతం చేయాల‌ని తాము ఎన్నో సార్లు అడిగినా లాభం లేద‌ని టీడీపీ సోష‌ల్ మీడియా విభాగం గ‌గ్గోలు పెడుతోంది.