Begin typing your search above and press return to search.

సగం జీవితం జైల్లోనే.. వీరప్పన్ సోదురుడు మత్తయ్యన్ మృతి

By:  Tupaki Desk   |   25 May 2022 12:43 PM GMT
సగం జీవితం జైల్లోనే.. వీరప్పన్ సోదురుడు మత్తయ్యన్ మృతి
X
సౌత్ ఇండియాను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. ఇతడి కోసం మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి వేటాడాయి. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. గంధపు చెక్కలు, ఏనుగుదంతాల స్మగ్లర్ గా, కిడ్నాపర్ గా మూడు రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ చనిపోయి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నాడు.

వీరప్పన్ నేరాల్లో సహచరుడు, ఆయన పెద్దన్న అయిన ముత్తయ్యన్ ఈరోజు చనిపోయారు. 75 ఏళ్ల మత్తయ్యన్ తమిళనాడులోని సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించాడు. తమ్ముడితోపాటు మత్తయ్యన్ అనేక నేరాల్లో పాలుపంచుకున్నట్లు రికార్డులున్నాయి. అయితే ఓ హత్య కేసులో నేరం రుజువుకావడంతో సేలం సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. వయసుతోపాటు ఆరోగ్య సమస్యలు పెరిగాయి.

మే1న గుండెపోటు రావడంతో ముత్తయ్యన్ ను జైలు అధికారుల సేలం ఆస్పత్రికి తరలించారు. సేలంలోని కుమారమంగళం మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మే 25న ఉదయం ముత్తయ్యన్ కన్నుమూశారు. వీరప్పన్ సోదరుడి మరణాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు.

1987లో ఫారెస్ట్ రేంజ్ చిదంబరం హత్య జరిగింది. ఈ హత్య కేసులో పోలీసులు మత్తయ్యన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే మీరప్పన్ పెద్దన్న మత్తయ్యన్ కు జీవితఖైదు పడింది. గత 35 ఏళ్లుగా ఆయన జైలులోనే ఉన్నాడు. మత్తయ్యన్ ను విడుదల చేయాలని పలువురు పిటీషన్లు వేసినా ఫలించలేదు. మత్తయ్యన్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు పోలీసులు.

వీరప్పన్ కూతురు విద్యారాణి తన పెదనాన్న అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరప్పన్ చనిపోయేనాటికే భార్య ముత్తులక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.