Begin typing your search above and press return to search.
సండ్ర ట్రాప్ కావటం లేదంట
By: Tupaki Desk | 10 July 2015 5:05 AM GMTఓటుకు నోటు వ్యవహారంలో సత్తుపల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్ కావటం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఆయన్ను.. ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇవ్వటం తెలిసిందే.
కోర్టు తమకు ఇచ్చిన రెండు రోజుల వ్యవధిలో వివిధ ప్రశ్నలతో.. ఓటుకు నోటుకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నాన్ని ఏసీబీ అధికారులు ముమ్మరంగా చేపట్టినట్లు తెలిసింది. తిప్పి తిప్పి ప్రశ్నలు సంధించటం.. మాటలతో ఉచ్చు బిగించే ప్రయత్నం చేసినప్పటికీ.. సండ్ర ముందు ఏసీబీ అధికారుల పప్పులు ఉడకలేదని తెలుస్తోంది.
తిప్పి తిప్పి ప్రశ్నలు సంధించినా.. ఆయన నోటి నుంచి ఆచితూచి సమాధానాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఎందుకు తీసుకున్నారు? ప్రమాదకరమని తెలిసి ఎందుకింత సాహసానికి ఒడిగట్టారని అధికారులు ప్రశ్నిస్తే..ఎన్నికలు ఏవైనా తాము సీరియస్‌గానే తీసుకుంటామని సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఇక.. విచారణలో భాగంగా సెబాస్టియన్ తమకు అన్ని వివరాలు చెప్పేశారని.. కాబట్టి వివరాలు దాచటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవంటూ మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసినా సండ్ర ఆ ట్రాప్‌లో పడలేదని తెలిసింది. సెబాస్టియన్ మీకు ఏం చెప్పారో నాకు తెలీదు.. ఈ వ్యవహారం నాకేమీ తెలీదని బదులిచ్చినట్లు తెలిసిందే. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు పొడి పొడిగా సమాధానాలు ఇస్తున్నారని.. ఎంతగా ప్రయత్నించినా సండ్ర నోటి నుంచి చాలా విషయాలు చెప్పించలేకపోతున్నట్లుగా ఏసీబీ అధికారులు వాపోతున్నట్లు చెబుతున్నారు.