Begin typing your search above and press return to search.
గవర్నర్ పదవి ఇవ్వలేదనే మోత్కపల్లి రచ్చ..
By: Tupaki Desk | 28 May 2018 8:59 AM GMTఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మోత్కుపల్లిపై నిప్పులు కురిపించారు. సోమవారం ఉదయం చంద్రబాబుపై మోత్కుపల్లి విమర్శలు చేసిన అనంతరం సండ్ర వెంకటవీరయ్య మీడియాతో మాట్లాడారు.. గవర్నర్ పదవి ఇవ్వకపోవడాన్ని ప్రపంచం బద్దలైపోయినట్లు మోత్కుపల్లి చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ గిరి రాకపోవడంతోనే మోత్కుపల్లి విమర్శలు చేస్తున్నారని అన్నారు.
మోత్కుపల్లికి నోటి దురుసుకు ఎక్కువని.. 1989లో ఎన్టీఆర్ .. మోత్కుపల్లికి అందుకే పార్టీ టికెట్ ఇవ్వలేదని సండ్ర ఆరోపించాడు. మహానాడు సమయంలోనే పాపులర్ కావచ్చని మోత్కుపల్లి విషం కక్కుతున్నాడని మండిపడ్డారు.
తెలంగాణ సీఎం దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శించిన మోత్కుపల్లికి కేసీఆర్ ఇప్పుడు దేవుడయ్యాడా.? అని సండ్ర మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత మోత్కుపల్లికి లేదన్నారు. నల్గొండ జిల్లాలో అందర్నీ ఇబ్బంది పెట్టిన నీచుడు మోత్కుపల్లి నర్సింహులు అంటూ తీవ్రంగా విమర్శించారు.
టీడీపీలో ఉంటూనే మోత్కుపల్లి కేసీఆర్ - పవన్ - వైఎస్ జగన్ ను పొగుడుతారా అంటూ సండ్ర మండిపడ్డారు. మోత్కుపల్లి రాజకీయ ప్రత్యర్థుల చేతిలో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. మోత్కుపల్లి వెనుకాల ఎవరున్నారో తనకు తెలుసన్నారు. టీఆర్ ఎస్ - కేసీఆర్ ను ఆకాశానికెత్తుతుంటేనే అర్థమవుతోందన్నారు. మోత్కుపల్లి తన రాజకీయ జీవితానికి ఆయనే సమాధి తవ్వుకుంటున్నాడని సండ్ర ఎద్దేవా చేశారు.
నిన్నటి వరకు చంద్రబాబును పొగిడి.. ఇప్పుడు సంస్కార హీనంగా విమర్శిస్తారా.? అంటూ మోత్కుపల్లిపై సండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ పార్టీలో తెలంగాణ టీడీపీ విలీనం చేయాలన్నప్పుడే మోత్కుపల్లి నర్సింహులు చచ్చిపోయాడని.. ఇంకా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేంటని అన్నారు. ఇలాంటి దుర్మార్గుడిని టీడీపీ మహానాడుకు ఎలా ఆహ్వానిస్తారని సండ్ర ప్రశ్నించారు.