Begin typing your search above and press return to search.
ఏపీ సెక్రటేరియట్ లో తెలంగాణ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 7 March 2017 6:12 AM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సందడి చేశారు. ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న సండ్ర ఏపీ వెలగపూడి సచివాలయానికి వచ్చారు. పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసుల నేపథ్యంలో తాజా పరిణామాలపై పలువురు నాయకులతో చర్చించారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి? తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలేంటి? అనే అంశాలపై సండ్ర ఆరా తీసినట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబుతోనూ భేటీ అయి చర్చించారని తెలిసింది. ఓటుకు నోటు కేసులో ఐదో నిందితుడైన సండ్ర.. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అక్కడి నుంచే కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డితోనూ ఫోన్ లో చర్చించినట్లు సమాచారం.
కాగా, 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ అంటూ చంద్రబాబు ఫోన్ సంభాషణల ఆడియో టేపు కూడా వెలుగు చూసింది. ఈ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ పరీక్షల్లోనూ తేలింది. దీంతో చంద్రబాబును విచారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ కేసులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొనడంతో రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సవాలుచేశారు. చట్టసభల ప్రతినిధులకు లంచాలు ఇవ్వడం అవినీతి వ్యతిరేక చట్టం పరిధిలోకి వస్తుందన్న వాదనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ద లూథ్రా వాదనలు చేస్తూ.. ఈ కేసుతో పిటిషనర్‌కు సంబంధం లేదని, రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే ఆయన కేసును దాఖలు చేశారని పేర్కొన్నారు. పిటిషన్ దాఖలు చేసే అర్హత పిటిషనర్ కు లేదని అన్నారు. ఆయన వాదనను పరిగణనలోకి తీసుకోని జస్టిస్ బూబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ, సాధ్యమైనంత త్వరలో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశించింది. తెలంగాణ ఏసీబీకి కూడా నోటీసులు పంపింది. ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఈ విషయానికి ఉన్న తీవ్రతను సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. తమ వద్ద మరిన్ని ఆధారాలున్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/