Begin typing your search above and press return to search.
ఖిల్లాలాంటి జిల్లాలో టీడీపీ మనుగడ పోరాటం
By: Tupaki Desk | 12 April 2016 8:07 AM GMTతెలంగాణలో కంచుకోటలాంటి జిల్లాల్లో మనుగడ కోసం టీడీపీ పోరాడుతోంది. ఉనికి కోసం ఆరాటపడుతోంది. బలమైన కేడర్ తోపాటు సమర్థ నాయకత్వం కూడా కరువైంది. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ భవిష్యత్తు గాలికి వదిలేసి..తమ భవిష్యత్తు కోసం పార్టీని వీడుతున్నారు.
ఖిల్లా లాంటి జిల్లాలో ఎందుకు ఈ పరిస్థితి అంటే..
ఖమ్మంజిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్టీఆర్ మొదలు చంద్రబాబు వరకూ ఖమ్మం నేతలకు ప్రత్యేకమైన గుర్తింపును - ప్రాధాన్యాన్ని ఇచ్చారు. నేడు అదే జిల్లాలో మనుగడ కోసం పోరాడాల్సిన దుస్థితిలో టీడీపీ చిక్కుకుంది. దాదాపు 35 ఏళ్లపాటు ఆ పార్టీని ముందుండి నడిపించిన తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అధిష్టానం వైఖరితో టీఆర్ ఎస్ గూటికి చేరారు. దీంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా తారుమారయ్యాయి. శాసించే స్థాయి నుంచి బలహీన స్థితికి టీడీపీ చేరుకుంది.
ఇక్కడ టీడీపీ ఎంతగా బలహీనపడిందంటే ఇటీవల జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క డివిజన్ లో కూడా గెలవలేకపోయింది. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైకాకా కూడా రెండు డివిజన్లు గెలుచుకుంది. ఇప్పటికే పార్టీని వదిలివెళ్ళిన వారు వెళ్ళిపోగా, మిగిలిన వారు తలోదిక్కు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ క్యాడర్ కు దైర్యం చెప్పి ముందుకు నడిపించే నేతలే కరువయ్యారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వలసలు మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీకి ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన నియోజకవర్గమైన సత్తుపల్లిలో క్యాడర్ ను కాపాడుకోవాలన్న ఆశతో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఫలితాలు వచ్చాక సత్తుపల్లిలో టీడీపీకి చెందిన నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ సహా మరి కొందరు కౌన్సిలర్లు టీఆర్ ఎస్ తీర్థం పుచ్చేసుకున్నారు. దీంతో వెంకటవీరయ్య సత్తుపల్లికి చెందిన కౌన్సిలర్లను ఖమ్మం పిలిపించి రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లతోపాటు పలువురు నాయకులు వెంకటవీరయ్య ముందు కుండ బద్దలుకొట్టారట. ఎమ్మెల్యేగా సత్తుపల్లిలో పూర్థిస్థాయిలో అందుబాటులో ఉంటేనే రాబోయే ఏ ఎన్నికల్లో పోటీచేయడానికైనా టీడీపీకి అవకాశం ఉంటుందని లేనిపక్షంలో ఆ ఛాన్స్ కూడా దక్కదని తేల్చేశారట.