Begin typing your search above and press return to search.

సూయిజ్ కెనాల్ లో భారీ నౌకపై ఇసుక తుఫాన్ దాడి ఏం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   27 March 2021 4:14 PM GMT
సూయిజ్ కెనాల్ లో భారీ నౌకపై ఇసుక తుఫాన్ దాడి ఏం జరిగిందంటే?
X
ప్రపంచంలోనే కీలక సముద్ర రవాణా మార్గమైన సూయిజ్ కాలువలో ఇప్పటికే భారీ ఓడ ఇరుక్కుపోయి మొత్తం రవాణా స్తంభించిన సంగతి తెలిసిందే. దాన్ని బయటకు తీసి రవాణా పునరుద్ధరించడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. అటూ ఇటూ భారీగా నౌకలు పేరుకుపోయాయి. ప్రపంచదేశాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది.

ఈ క్రమంలోనే తెల్లవారుజామున హఠాత్తుగా ఇసుక తుఫాన్ విరుచుకపడింది. ఇసుక తుపాను దెబ్బకు భారీగా గాలులు వీయడంతో కార్గో నౌక ఇసుకలో చిక్కుకుపోయింది. గత రెండు రోజులుగా నౌక అంగుళం కూడా కదలని పరిస్థితి. మెరిటైమ్ ట్రాకింగ్ టెక్నాలజీ ద్వారా కార్గో నౌకను కదిలించేందుకు ఐదురోజులుగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు.

పనామాకు చెందిన ఈ కార్గో నౌక మంగళవారం ఇసుక తుఫాన్ ధాటికి చిచ్చుకుంది. అప్పటి నుంచి అటుగా రాకపోకలు సాగించే ఇతర నౌకలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈజిప్ట్ జలాశయ మార్గంలో ఇప్పటికే 280కి పైగా నౌకలు నిలిచిపోయాయి. నౌకలోని కంటైనర్లను మరో నౌకలో తరలించి మార్గాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.1300 చదరపు అడుగుల పొడవైన కంటైనర్ నౌకను కదిలించేందుకు రెండు సార్లు విఫలయత్నం జరిగింది. ప్రపంచ దేశాలకు కీలకమైన నౌకమార్గాన్ని క్లియర్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు.

నాలుగు రోజుల క్రితం సూయ‌జ్ కాలువ‌లో ‘ఎవ‌ర్ గివెన్‌’ అనే భారీ కంటెయినర్ షిప్ చిక్క‌కుపోయిన విష‌యం తెలిసిందే. చైనా నుంచి నెదర్లాండ్స్ కు పయనమైన ఈ నౌక.. సముద్రంలో భారీగా పెనుగాలుల కార‌ణంగా కాలువ‌కు అడ్డం తిరిగి ఇసుక‌లో కూరుకుపోయింది. దాదాపు నాలుగు వంద‌ల మీట‌ర్ల పొడ‌వు, యాభై తొమ్మిది మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న ఈ అతిభారీ నౌక సూయ‌జ్ కాలువ‌కు అడ్డంగా తిర‌గ‌డంతో ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ఈ నౌక‌ను స‌రైన మార్గంలోకి తిప్పేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

అయితే.. ఇందులో ఉన్న గూడ్స్ తో క‌లిపి ఈ నౌక బ‌రువు దాదాపు 2 ల‌క్ష‌ల 20 వేల ట‌న్నుల బ‌రువు ఉంటుందని అంచ‌నా. ఇంత‌టి భారీ షిప్ ను ప‌క్క‌కు జ‌ర‌ప‌డానికి వారాలా కొద్దీ శ్ర‌మించాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. అస‌లు, ఆ ప‌ని ఎప్పుడు పూర్త‌వుతుందో కూడా ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. అయితే.. ఇంత‌టి బ‌రువైన నౌక‌ను ప‌క్కకు తిప్ప‌డానికి ఎలాంటి ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు? అస‌లు ఎలా తిప్ప‌గ‌ల‌రు? అన్న‌ది ఆస‌క్తిక‌ర అంశం. ఆ వివ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ షిప్ ను ప‌క్క‌కు క‌ద‌ప‌డానికి ఏకంగా తొమ్మిది ఓడ‌లు ప‌నిచేస్తున్నాయి. ఎవ‌ర్ గివెన్ కు ఇనుప తీగ‌లు క‌ట్టి ఈ షిప్పుల ద్వారా లాగుతూ.. అడుగున ఇరుక్కున్న భాగంలో ఇసుక‌, మ‌ట్టిని త‌వ్వుతున్నారు. కాలువ‌కు అడ్డంగా తిరగ‌డ‌మే కాకుండా.. రెండో ద‌రుల‌కూ త‌గిలి ఇరుక్కుపోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా మారింది. నెద‌ర్లాండ్ కు చెందిన బోస్కాలిస్ అనే కంపెనీ ఇసుక తొల‌గింపు చేప‌ట్టింది. ఈ కంపెనీ చేప‌డుతున్న ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నాయంటే..

1. తొమ్మిది ఓడ‌లు ఒకవైపు నుంచి లాగుతుంటాయి. మరోవైపు ఓడ ముందు భాగాన్ని బయటకు తేల్చేందుకు మట్టిని తవ్వుతుంటారు.

2. అడుగున ఉన్న ఇసుక‌, బుర‌ద‌ను ఎత్తిపోవ‌డం ద్వారా ఓడను క‌దిలించేందుకు ప్ర‌య‌త్నిస్తారు.

3. కంటెయినర్ లో ఉన్న బ‌రువును ఇత‌ర ఓడ‌ల్లోకి త‌ర‌లించ‌డం ద్వారా బరువు త‌గ్గిస్తారు.

ప్ర‌ధానంగా ఈ మూడు ప‌నులు చేస్తున్నారు. అయితే.. ఆ షిప్పులో ఉన్న బ‌రువు సామాన్య‌మైంది కాదు. అందులో 20 అడుగు పొడ‌వైన కంటెయిన‌ర్లు దాదాపు 20 వేల వ‌ర‌కు ఉన్నాయి. వీటిని తొల‌గించానికి ఎన్ని రోజులు ప‌డుతుందో తెలియ‌దు. అంతేకాదు.. వీటిని తొల‌గించ‌డం అంత తేలిక‌కాదు. వాటిని దించుతున్న క్ర‌మంలో ఓడ బ్యాలెన్స్ త‌ప్పే ప్ర‌మాదం కూడా ఉంది. అది జ‌రిగితే ఎవ‌ర్ గివెన్ బోల్తా ప‌డే అవ‌కాశం కూడా ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది.

ఇవ‌న్నీ చేప‌ట్టిన త‌ర్వాత‌.. చాలా బ‌రువు త‌గ్గించిన త‌ర్వాత ఎవ‌ర్ గివెన్ షిప్ ను ప‌క్క‌కు జ‌ర‌ప‌డం సాధ్య‌మ‌వుతుంది. మ‌రి, ఇదంతా ఎప్పుడు పూర్త‌వుతుందో? ఎన్ని రోజులు ప‌డుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేకుండా ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ ర‌వాణా మొత్తం స్తంభించిపోతున్న కార‌ణంగా.. వ్యాపార లావాదేవీలు మొత్తం నిలిచిపోతున్న కార‌ణంగా.. ఒక రోజుకు జ‌రిగే న‌ష్టం ఎంతో దాదాపు రూ.70 వేల కోట్లు!