Begin typing your search above and press return to search.
సంగం డెయిరీ స్వాధీనం చెల్లదు .. జగన్ సర్కార్ కి హైకోర్టు బిగ్ షాక్
By: Tupaki Desk | 1 Sep 2021 8:30 AM GMTసంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్ బెంచ్ కొట్టి వేయడాన్ని హైకోర్టు డివిజనల్ బెంచ్ కూడా సమర్థించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. దీనితో సంగం డెయిరీ ప్రస్తుతం ఉన్న డైరక్టర్లు, రైతులే నిర్వహించుకోనున్నారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పును ఆహ్వానించి సంగం డెయిరీని ప్రస్తుతం ఉన్న కార్యవర్గమే నిర్వహించుకునేలా ఆమోదిస్తుందో, లేక సుప్రీంకోర్టుకు వెళ్తుందో స్పష్టత లేదు.
కానీ ఇప్పటికైతే మాత్రం సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వం అనుకున్నది చేయలేకపోయింది. హైకోర్టులో ఎదురు దెబ్బలు తిన్నది. సంగం డెయిరీకి ఉన్న మిల్క్ ప్రొడ్యూసర్స్ అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 27న జీవో ఇచ్చింది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసేసింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో వెల్లడించింది. రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు ఇప్పగించింది.
సంగం డెయిరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది. అయితే, ఆ చట్టంలోకి అక్రమంగా మార్చారని సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రభుత్వం ఆరోపించింది. గతంలో ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. అయితే సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే దీనిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఏప్రిల్ 23వ తేదీన చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీలను అరెస్ట్ చేసింది. 27వ తేదీన రోజువారీ వ్యవహారాలకు భంగం కలగకూడదంటూ స్వాధీన ఉత్తర్వులు జారీ చేసి తెనాలి జాయింట్ కలెక్టర్ ను చార్జ్ తీసుకోవాలని ఆదేశించింది.
ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని డైరక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు గత మే పదిహేడో తేదీన కొట్టి వేసింది. ఆ జీవో చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. డెయిరీ కార్యకలాపాలను డెయిరీ డైరక్టర్లే నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. జీవో చెల్లదని హైకోర్టు స్పష్టంచేయడంతో మళ్లీ కార్యకలాపాలు ఇప్పటిలాగే డైరక్టర్ల చేతుల మీదుగానే నడుస్తున్నాయి. మొత్తంగా సంగం డెయిరీ వివాదానికి హైకోర్టు ముగింపు ఇచ్చినట్లయింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే వివాదం కొనసాగుతుంది. లేకపోతే ఇక ఎప్పటికీ ప్రభుత్వం ఎప్పటికీ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోలేదు.