Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు గుడి కట్టిస్తానన్న జగ్గారెడ్డి? ఎందుకంటే?
By: Tupaki Desk | 18 April 2019 11:35 AM GMTతెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉధృతంగా ఉద్యమం జరుగుతున్న వేళ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేయటానికి పెద్ద పెద్ద నేతలు సైతం మాట అనేందుకు జంకుతున్న వేళ.. వెనుకా ముందు చూసుకోకుండా ఘాటు వ్యాఖ్యలు చేసే దమ్మున్న నేతగా జగ్గారెడ్డి పేరు వినిపించేది. తెలంగాణ వాదిగా ఉంటూ.. కేసీఆర్ ను మాత్రం వ్యతిరేకించే ఆయన తీరు మిగిలిన వారికి భిన్నంగా ఉండేది. ఒకప్పుడు కేసీఆర్ తో పూసుకురాసుకు తిరిగిన హిస్టరీ ఉన్న జగ్గా.. తర్వాతి రోజుల్లో గులాబీ బాస్ పై అదే పనిగా ఫైర్ అయ్యేవారు.
ఈ మధ్యన జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ.. అరెస్ట్ కావటం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం.. ఆయన గులాబీ కండువా కప్పుకోవటానికి సిద్ధమవుతున్నారని.. కారు ఎక్కటం పక్కా అన్న మాట వినిపించింది. అయితే.. అది నిజం కాదన్న జగ్గారెడ్డికి సంబంధించి వచ్చిన మార్పు ఏదైనా ఉందంటే.. అది కేసీఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేసే విషయంలో తీవ్రత తగ్గిందని చెప్పాలి.
తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల సందర్భంగా కూడా గతంలో మాదిరి కేసీఆర్ మీద విరుచుకుపడింది లేదు. తాజాగా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అభినందనీయంగా ఆయన వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వమే ప్రణాళిక రూపొందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పటాన్ని ఆయన స్వాగతించారు.
కేసీఆర్ తాను చెప్పిన నిర్ణయాన్ని కానీ ఏడాదిలో అమలు చేస్తే.. తాను కేసీఆర్ కు గుడి కట్టిస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో పట్టుదలతో ఉన్న కేసీఆర్.. ఇప్పుడా విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన వైనం తెలిసిందే. ఇలాంటి వేళ.. కేసీఆర్ మనసును దోచుకునేలా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఇ స్పెషల్ గా ఉందని చెప్పక తప్పదు.