Begin typing your search above and press return to search.
ఎర్రచందనం లేడీ డాన్ ఒకప్పుడు ఎయిర్ హోస్టెస్
By: Tupaki Desk | 11 May 2016 7:42 AM GMTబాలీవుడ్ నటీమణులు కొందరు మాఫియా డాన్ లను పెళ్లాడి, వారితో సహజీవనం చేస్తూ మాదక ద్రవ్యాలు - ఇతర నేరాల్లో పాలుపంచుకోవడం, డాన్ లకు తెరవెనుక సహకారం అందించడం తెలిసిందే. మందాకిని - మోనికా బేడీ - మమతా కులకర్ణి వంటి ప్రముఖ నటీమణులందరిదీ ఇదే కథ. తాజాగా చిత్తూరు పోలీసులు అరెస్టు చేసిన సంగీతా ఛటర్జీది కూడా దాదాపుగా ఇదే కథ. అయితే, మిగతావారిలా మాదక ద్రవ్యాలు - అల్లర్లలో కాకుండా ఎర్రచందనం డాన్ గా ఎదిగింది. మోడల్ గా - ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన ఆమె అనంతరం ఎర్రచందనం డాన్ లక్ష్మణ్ ను వివాహమాడి తాను కూడా స్వయంగా ఎర్రచందనం డాన్ గా మారిపోయింది.
చిత్తూరు జిల్లా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రెడ్’లో భాగంగా కోల్ కతాలో అరెస్టైన మహిళా డాన్ సంగీతా చటర్జీ నెట్ వర్క్ భారీ నెట్ వర్క్ ఏర్పాటుచేసుకుంది. ఆమె విలాసవంతమైన జీవితం - పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్న చిత్తూరు పోలీసులకు మైండ్ బ్లాకయింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ గా ఎదిగిన లక్ష్మణ్ కు సంగీతా చటర్జీ రెండో భార్య. అంతకుముందు ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన సంగీతాకు పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లక్ష్మణన్ ను వివాహం చేసుకుంది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత సంగీతా... మోడల్ గానూ రాణించింది. ఎన్నో ప్రముఖ కంపెనీల ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ సంగీతా... నిత్యం బార్లు - పబ్బు - క్లబ్బుల వెంట ఖరీదైన కార్లలో తిరిగేది. 2014లో లక్ష్మణ్ అరెస్ట్ కావడంతో భర్త నిర్వహిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా బాధ్యతలను కూడా సంగీతా తన భుజాన వేసుకుంది. ఈ క్రమంలో దేశంలోని పలు నగరాల్లోని స్మగ్లర్లే కాక అంతర్జాతీయ స్మగ్లర్లతోనూ ఆమె సంబంధాలు నెరిపింది. విదేశాల నుంచి హవాలా రూపంలోనూ డబ్బు తెప్పించడంలోనూ సంగీతా ఆరితేరిపోయిందట. చెన్నైకి చెందిన ఓ స్మగ్లర్ మోజెస్ ద్వారానే ఆమె రూ.10 కోట్ల మేర చెల్లింపులు జరిపిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆమెకు చెందిన సమగ్ర వివరాలు సేకరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ తన సిబ్బందిని కోల్ కతా పంపించారు. అక్కడికి వెళ్లిన చిత్తూరు పోలీసులు సంగీతాను అరెస్ట్ చేశారు.
కాగా సంగీత నెట్ వర్క్ ఏ స్థాయిలో ఉందో చిత్తూరు పోలీసులకు స్టార్టింగులోనే అర్థమైపోయింది. కోల్ కతాలో ఆమెను అరెస్టు చేసిన తరువాత అక్కడి నుంచి చిత్తూరు తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయగా కొన్ని ఇబ్బందులతో అది కుదరలేదు. దీంతో కోల్ కతా కోర్టులోనే ఆమె అరెస్ట్ ను చూపగా, తన పలుకుబడిని వినియోగించుకుని సంగీతా కేవలం ఒక్క రోజులోనే బెయిల్ తెచ్చుకుంది. ఆమె సంగతి తెలియడంతో విదేశాలకు పారిపోతుందేమో అన్న అనుమానంతో ఎలాగైనా చిత్తూరు తేవడానికి మన పోలీసులు అక్కడే ఉన్నారు.