Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు రెడ్ శాండిల్ క్వీన్ అరెస్ట్
By: Tupaki Desk | 29 March 2017 4:54 AM GMTనెలల తరబడి చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సక్సెస్ అయ్యాయి. ఎర్రచందనం అక్రమ రవాణాలో మొనగత్తె లాంటి రెడ్ శాండిల్ క్వీన్ కమ్ సినీనటి.. ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనాన్నిస్మగ్లింగ్ చేయటం ద్వారా కోట్లాది రూపాయిల్ని కూడబెట్టటమే కాదు.. బెంగాల్ లో తిరుగులేని రీతిలో చక్రం తిప్పే అమ్మడికి అరదండాలు వేయటంలో చిత్తూరు పోలీసులు విజయం సాధించారు.
గతంలో చిత్తూరు పోలీసులు బెంగాల్ కు వెళ్లి మరీ అదుపులోకి తీసుకోగా.. గంటల వ్యవధిలో బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె రేంజ్ అప్పట్లో సంచలనం సృష్టింటచటమే కాదు.. ఆమెను అరెస్ట్ చేయటం ఎంత కష్టమన్న విషయం అర్థమైంది.అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా..ఆమెను అరెస్ట్ చేయటం సాధ్యం కాని పనిగా మారింది.పట్టువదలని విక్రమార్కుల మాదిరి వ్యవహరించిన చిత్తూరు పోలీసులు.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాకు చెందిన సంగీత చటర్జీని అదుపులోకి తీసుకోగలిగారు.
విమానసంస్థలో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తూ.. తర్వాతి కాలంలో సినీ నటిగా పరిచయమైన ఆమె..తర్వాతి కాలంలో ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ కు దగ్గరైంది. అతని అరెస్ట్ నేపథ్యంలో రెడ్ శాండిల్ ను స్మగ్లింగ్ చేయటంతో పాటు.. హవాలా పద్ధతిలో భారీగా నగదును మార్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆమెను అరెస్ట్ చేసేందుకు చిత్తూరు పోలీసులు కోల్ కతాకు వెళ్లారు.
అయితే.. ఆమెను అరెస్ట్ చేయటం అంత తేలిక కాదన్న విషయం చిత్తూరు పోలీసులకు అర్థమైంది. నాటి నుంచి అదే పనిగా ప్రయత్నాలు చేస్తూ.. కోల్ కతా స్థానిక కోర్టుల అడ్డుంకుల్నిఅధిగమించి ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేశారు. మంగళవారం అర్థరాత్రి ఆమెను చిత్తూరు తీసుకొచ్చారు. ఆమెను విచారిస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన కీలక ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/