Begin typing your search above and press return to search.

కమలద్వయానికి సంఘ్‌ షాక్‌

By:  Tupaki Desk   |   27 Dec 2018 4:15 PM GMT
కమలద్వయానికి సంఘ్‌ షాక్‌
X
నిన్నటి వరకు వారిద్దరిదే పైచేయి. నిన్నటి వరకు అటు పార్టీలోను - ఇటు ప్రభుత్వంలోను వారేం చెబితే అదే శాసనం. నిన్నటి వరకు వారిద్దరు అటు ప్రభుత్వాన్ని అటు పార్టీని తమ చెప్పిచేతాలలో పెట్టుకున్నారు. అంతటి వైభవం మూడు రాష్ట్రాల హింది బెల్ట్ ఎన్నికలతో తుడిచి పెట్టుకుపోయింది. ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా..? వారిలో ఒకరు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయితే మరొకరు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. 2014లో కేంద్రంలో బిజేపీ అధికారంలోకి రావడం - ప్రధానిగా నరేంద్ర మోదీ బాద్యతలు స్వీకరించడంతో ఈ ఇద్దరు కమలనాథుల ప్రాభవం వెలిగింది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికలలోను భారతీయ జనతా పార్టీ దక్కిన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు ఇద్దరు. ఇప్పటి వరకూ బాగానే నడిచింది. ఇటీవల జరిగిన హిందీ బెల్ట్ రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పాలైంది. అంతే ఒక్కసారిగా అటు పార్టీలోను - ఇటు ప్రభుత్వంలోను మరోవైపు పార్టీ మాత్రు సంస్ధ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ లోను వారి ప్రతిష్ట మసకబారుతోంది. పార్టీ విజయాలను తమ ఖాతా లో వేసుకున్న మోదీ - అమిత్‌ షా ఇటీవల వచ్చిన పరాజయాన్ని మాత్రం తమకు పట్టనట్లు గానే వ్యవహరిస్తున్నారు.

ఈ పరాజయంతో ఇద్దరు కమలనాథులకు చుక్కలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై దీని ప్రభావం పడుతోంది. రెండు మూడు నెలలలో జరగనున్న లోక్‌ సభ ఎన్నికలకు వివిధ రాష్ట్రాలకు ఇన్‌ చార్జ్‌ లను నియమించారు. వీరంత సంఘ్‌ పరివార్‌ సూచించిన వారే. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ చార్జ్ గా గోర్దాన్ జోధాప్యాను నియమించారు. ఈయన గుజారాత్ మాజీ హోంమంత్రి. అమిత్ షా - నరేంద్ర మోదీలకు ఈయన వ్యతిరేక వర్గమని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా మోదీ పట్ల నానాటికి వ్యతిరేకత పెరుగుతుండడంతో గోర్దాన్ జోధీప్యాను నియమించినట్లు చెబుతున్నారు. ఈ నియామకం అగ్ర నాయకులిద్దరికి రుచించని నిర్ణయం. అయినా ఆర్‌ ఎస్‌ ఎస్ పెద్దలు ఈ నిర్ణయం వెనుక ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయం ముందు ముందు భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలకు నాంది అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.