Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ నేత డీపీలు మారాయి.. సంఘ్ సోషల్ ఖాతా డీపీ మారదా?
By: Tupaki Desk | 4 Aug 2022 1:30 PM GMTవాళ్లో వీళ్లో చెప్పింది కాదు. సాక్ష్యాత్తు దేశ ప్రధానమంత్రి.. అది కూడా సంఘ్ ఆజ్ఞ ఉంటే తప్పించి బీజేపీ ప్రధానిగా కుర్చీలో కూర్చోరన్న నానుడి ఉండే దేశంలో.. తాము పెట్టిన ప్రధాని నోటి నుంచి వచ్చిన మాటను ఆ దేశభక్తి సంస్థ ఫాలో కాదా? అన్నది ఇప్పుడు ప్రశ్న. తన మానసపుత్రిక అయిన మన్ కీ బాత్ లో భాగంగా.. మొన్నటి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆగస్టు రెండో తేదీ నుంచి దేశంలోని వారు తమ సోషల్ మీడియా ఖాతాల డీపీలు మార్చుకోవాలని.. జాతీయ జెండాను పెట్టుకోవాలన్న సూచన చేయటం తెలిసిందే.
మోడీ అంతటి మహానేత నోటి నుంచి వచ్చినంతనే ఫాలో అయ్యే బీజేపీ నేతలు.. ఆ పార్టీ అనుబంధ సంస్థలు తమ సోషల్ ఖాతాల డీపీల్ని జాతీయ జెండాతో మార్చేయటం తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. బీజేపీకి ఐడిలాజికల్ గా వ్యవహరిస్తుందని చెప్పే సంఘ్ పరివార్ తన సోషల్ మీడియా ఖాతాను ఈ వార్త రాసే సమయానికి (ఆగస్టు నాలుగు మధ్యాహ్నానికి) కూడా తన డీపీలో కాషాయ జెండా తప్పించి.. త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోకపోవటం దేనికి నిదర్శనం?
దేశం మీద భక్తి.. దాని మీద ప్రేమ తమకు మించి మరెవరికి ఉండదన్నట్లుగా వ్యవహరిస్తూ..క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉండే ఆ సంస్థ.. దేశ ప్రధాని నోటి నుంచి వచ్చిన మాటను ఎందుకు ఫాలో కాదన్న సందేహం ప్రతి ఒక్కరికి కలిగే పరిస్థితి.
ఇదిలా ఉండగా.. రాజకీయంగా మోడీని ఆయన భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ అధినాయకులైన రాహుల్.. ప్రియాంకలతో పాటు.. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు శశిథరూర్.. జైరాం రమేశ్.. పవన్ ఖేరా.. సచిన్ పైలెట్.. రేవంత్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల సోషల్ మీడియా ఖాతాల డీపీలు మారాయి.
చివరకు కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీకి చెందిన ఇతర విభాగాలకు చెందిన అధికారిక సోషల్ ఖాతాల డీపీలు కూడా మారాయి. అయితే.. మోడీ మాష్టారు చెప్పినట్లు కాకుండా.. మారిన డీపీల్లో త్రివర్ణ పతాకంతో పాటు.. దాన్ని పట్టుకున్న తమ నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ పట్టుకున్నది పెట్టుకున్నారు. ఇదేమీ తప్పు కాదు. ఆ మాటకు వస్తే.. దేశానికి తొలి ప్రధాని నెహ్రూ అయినందున.. ఆయన జాతీయపతాకాన్ని పట్టుకున్న ఫోటో కూడా స్వాగతించొచ్చు.
కానీ..సంఘ్ కు చెందిన సోషల్ ఖాతాల డీపీలు మారకపోవటం దేనికి నిదర్శనం? అసలుసిసలు దేశభక్తి సంస్థగా చెప్పే ఆర్ఎస్ఎస్.. ప్రధాని మోడీ సూచనను సైతం లైట్ తీసుకుంటుందా? ఒకవేళ.. మోడీ మాటను ఫాలో కాకూడదంటే.. భారతమాత చేతిలో జాతీయ జెండాతో ఉన్న డీపీ పెట్టుకున్నా సరిపోయేది కదా? అది కూడా ఎందుకు చేయనట్లు? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేవారెవరు?