Begin typing your search above and press return to search.
సానియా ఎంత లెక్క మనిషో తెలుసా?
By: Tupaki Desk | 17 Feb 2017 8:10 AM GMTడబ్బు దగ్గర మాట పడే అవకాశం ఉంటే.. ఆ డబ్బునే వదులుకునే వారు చాలామందే కనిపిస్తారు. కానీ.. కొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. డబ్బు విషయంలో వచ్చే విమర్శల్ని పట్టించుకోకుండా.. వాదన వినిపించే వారు కొందరుంటారు. చేతిలో నుంచి పైసలు పోవటాన్న ఏ మాత్రం ఇష్టపడని తీరు వారిలో కనిపిస్తుంది. తాజాగా సానియా వ్యవహారం చూస్తే ఇదే తీరులో ఉందని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా ఇచ్చిన కోటి మీద సేవా పన్ను చెల్లించాలంటూ సర్వీస్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సమన్లు జారీ చేయటం.. ఇదో ఇష్యూలా మారటం తెలిసిందే.
కోటి రూపాయిల మీద 14.5శాతం సేవాపన్నును కట్టాలన్నది సేవాట్యాక్స్ శాఖ వారి వాదన. దీనికి సానియా మాత్రం నో అంటే నో అనేస్తుంది. ఈ ఇష్యూ మీద అధికారులు సానియాకు నోటీసులు ఇవ్వటం.. ఆ విషయం మీడియాలో రావటం తెలిసిందే. తాజాగా అధికారులకు తన సీఏ ద్వారా సమాధానం ఇచ్చిన సానియా.. తానుసర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం తనకు శిక్షణ ప్రోత్సాహకంగా కోటి రూపాయిలు ఇచ్చిందే కానీ బ్రాండ్ అంబాసిడర్ గా ఇవ్వలేదని.. ప్రోత్సాహకాలకు పన్ను ఉండదంటూ తన వాదనను వినిపించింది. ఈ ఎపిసోడ్ చూసినప్పుడు సానియాలో ఇంత లెక్క మనిషి ఉన్నారా? అనిపిపించక మానదు. మరి.. ఆమె వివరణకు అధికారులు ఏం బదులిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/