Begin typing your search above and press return to search.
ఔను ప్రత్యేక విమానం అడిగా-సానియా
By: Tupaki Desk | 3 Dec 2015 12:02 PM GMTమధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే క్రీడా అవార్డుల కార్యక్రమానికి హాజరవడానికి తాను ప్రత్యేక విమానం సమకూర్చమని అడిగిన మాట వాస్తవమే అని.. అందులో తప్పేముందని అంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. ఐతే కారణం లేకుండా విమానం సమకూర్చమని సానియా అడగలేదంటూ ఆమె తరఫున మీడియా వ్యవహారాలు చూసి క్వాన్ ఏజెన్సీ తెలిపింది.
‘‘మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే క్రీడా అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు సానియా ఆసక్తి కనబరిచింది. సంబంధిత వ్యక్తులతో మేం సంప్రదింపులు జరిపాం’’ అని క్వాన్ ఏజెన్సీ తెలిపింది. సానియా భోపాల్ వచ్చేందుకు ప్రత్యేక విమానం కావాలని కోరిన సంగతి వాస్తవమేనని, అయితే ఆమె వేడుకలో పాల్గొనేందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసినట్టు వార్తలు అవాస్తవమని ఆ సంస్థ తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం అక్టోబర్ 28న అని, ఐతే మరుసటి రోజు ఉదయం గోవాలో మరో కార్యక్రమానికి ఆమె హాజరుకావాల్సి ఉండటంతో గోవా నుంచి భోపాల్ కు కమర్షియల్ విమానంలో వెళితే ఏడు గంటల సమయం పడుతుందని భావించి ప్రత్యేక విమానం సమకూర్చాలని కోరినట్లు క్వాన్ ఏజెన్సీ వివరించింది.
ఐతే కారణాలేవి అయినప్పటికీ తన తోటి క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానం అడగడం టూమచ్ అనడంలో సందేహం లేదు. పైగా తన మేకప్ కిట్ కోసం రూ.75 వేలు అడగడం కూడా అతిగానే ఉంది. సానియా డిమాండ్లకు బెదిరిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదుకే చెందిన బ్యాండ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా ఆ వేడుకను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది.