Begin typing your search above and press return to search.
సానియా బ్రాండింగ్ సొంతానికేనా?
By: Tupaki Desk | 18 July 2016 5:25 AM GMTతెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తున్న సానియా మీర్జా వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరిత హారం కార్యక్రమంలో ఆమె ఎక్కడా దర్శనమివ్వడం లేదు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని గవర్నర్ - ముఖ్యమంత్రి, మంత్రులు - అధికారులు - సినీనటులు పిలుపునిస్తుండగా - సానియా మీర్జా మాత్రం కనిపించలేదు. దీంతో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పేరిట కోటి రూపాయలు తీసుకున్న సానియా కనీసం ఒక్క మొక్కైనా నాటారా? అని ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా నెటిజన్లు ఆగ్రహించడానికి కారణం కనిపిస్తోంది. సానియా హరిత హారంలో కనిపించకపోయినా జనం పట్టించుకోకపోయేవారేమో కానీ.. ఆమె ఇదే సమయంలో తన సొంత వస్తువులకు ఫుల్లుగా బ్రాండింగ్ చేస్తున్నారు. ‘‘ఏస్ అగెనెస్ట్ ఆడ్స్’’ పేరుతో రాసిన తన జీవితకథకు ప్రచారం చేసుకుంటున్నారు. నేషనల్ మీడియా - లోకల్ మీడియా అన్న తేడా లేకుండా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయించుకుంటున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు నగరాలన్నీ తిరుగుతూ తన పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రచారం చేస్తున్నారు. ఇలా సొంత బ్రాండ్ సృష్టించుకుంటున్న సానియా తెలంగాణ రాష్ట్రం విషయంలో తనకున్న బాధ్యతను మర్చిపోయారని నెటిజన్లు అంటున్నారు.
సానియా తీరుతో ఆగ్రహిస్తున్న నెటిజన్లు ఆమెపై ఆగ్రహించడమే కాకుండా సెటైర్లూ వేస్తున్నారు. కోటి రూపాయలు తీసుకున్న సానియాతో కోటి మొక్కలు నాటించాలని, ఆమెతో కోటి తట్టల మట్టి మోయించాలని ఇలా రకరకాలుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తున్న సానియా మీర్జా ఈ హరిత హారంలో పాల్గొని ప్రజలకు ఆదర్శంగా నిలిస్తే బాగుండేదన్న అభిప్రాయం వెలువడుతోంది.