Begin typing your search above and press return to search.
ఆ ఇద్దరూ ఈసారీ ఇరగదీసేస్తారా?
By: Tupaki Desk | 9 Jan 2016 4:57 AM GMTఏకంగా 25 వరుస విజయాలు సాధించటం ఏమాత్రం చిన్న విషయం కాదు. ఆ రికార్డు టెన్నిస్ జంట మన సానియా.. మార్టినా హింగిస్ సొంతం. గత ఏడాది వరుస విజయాలతో టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్న ఈ జంట కొత్త ఏడాది అదే ఊపును కొనసాగిస్తోంది. గత ఏడాది వివిధ టైటిళ్లను సొంతం చేసుకున్న ఈ ఇద్దరు తాజాగా బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్స్ కు చేరుకున్నారు.
యూఎస్ ఓపెన్ కు సన్నాహకంగా భావించే ఈ టోర్నీని చేజిక్కించుకోవటానికి మరో అడుగు మాత్రమే మిగిలింది. తాజాగా ఈ టోర్నీలో సెమీస్ లో విజయం సాధించిన సానియా.. హింగిస్ ద్వయం శనివారం ఫైనల్స్ ను ఆడనుంది. 2012లో సారా ఎరాని.. రాబెర్టా విన్సి జోడి 25 వరుస విజయాల్ని సాధించింది. గతంలో గిగి ఫెర్నాండెజ్.. నటాషాలు కలిసి 28 మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించారు. శనివారం విజయం సాధిస్తే.. సారా.. రాబెర్టా రికార్డును బీట్ చేస్తారు. మరో నాలుగు వరుస విజయాలు సాధిస్తే.. టెన్నిస్ చరిత్రలో అరుదైన రికార్డును సొంతం చేసుకునే ఈ ఛాన్స్ వీరికుంది. కొత్త సంవత్సరంలో సరికొత్త టైటిల్ తో పాటు.. రికార్డులు కూడా వీరి ఖాతాలో పడాలని ఆశిద్దాం.