Begin typing your search above and press return to search.
డబుల్ థమాకా;యూఎస్ డబుల్స్ టైటిల్ మనదే
By: Tupaki Desk | 14 Sep 2015 4:01 AM GMTమరో టైటిల్ భారత్ వశమైంది. మొన్నటి ఆనందం నుంచి ఇంకా బయటకు రాకముందే.. డబుల్ థమాకా అన్నట్లుగా యూఎస్ మహిళల డబుల్స్ లో లక్కీ పెయిర్ మార్టినా హింగిస్.. సానియా మీర్జా జంట టైటిల్ చేజిక్కించుకుంది.
శనివారం రాత్రి ఇదే టోర్నీలో ఇదే మార్టినా హింగిస్ తో జతకట్టిన లియాండర్ పేస్.. మిక్సెడ్ డబుల్స్ టైటిల్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన యూఎస్ మహిళల డబుల్స్ టైటిల్ ను అద్భుతమైన ఫామ్ తో దూసుకెళుతున్న మార్టినా హింగిస్.. సానియా మీర్జా జంట ప్రత్యర్థిని అలవోకగా ఓడించి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. తాజా టైటిల్ తో 20 గ్రాండ్ స్లామ్ లను సొంతం చేసుకున్న రికార్డు హింగిస్ ఖాతాలో చేరితే.. హింగిస్ తో జతకట్టిన సానియా.. తాజా విజయంతో ఈ ఏడాది మొత్తం ఐదు టైటిళ్లను సొంతం చేసుకున్న రికార్డును తన ఖాతాలో రాయించుకున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతేడాది ఒక్కటంటే ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ మన దేశానికి దక్కకున్నా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మొత్తం 5 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు భారత్ వశమయ్యాయి. ఇందులో లియాండర్ పేస్ సాధించినవి మూడు అయితే.. సానియావి రెండు. అయితే.. ఈ ఐదింటి వెనుక లియాండర్.. సానియా వేర్వేరుగా ఉన్నా.. వారితో ఉన్న ఒకేఒక్క వ్యక్తి మార్టినా హింగిస్. భారత్ కు అదృష్టదేవతగా మారిన ఈ స్విస్ క్రీడాకారిణి పుణ్యమా అని.. ఒక్క ఏడాదిలో ఇన్ని గ్రాండ్ స్లామ్ లు భారత్ వశయ్యాయని చెప్పటం అతిశయోక్తి కాదు. పేస్.. సానియా విజయాల్ని తక్కువ చేసిన చెప్పటం కాదు కానీ.. హింగిస్ కష్టాన్ని ధర్మంగా చెప్పాల్సి వస్తే.. హింగిస్ భాగస్వామ్యం భారత్ ఆటగాళ్లకే కాదు.. 130 కోట్ల భారతీయులకు సంతోషాన్నిస్తుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.