Begin typing your search above and press return to search.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎక్కడ ..!
By: Tupaki Desk | 22 July 2016 11:32 AM GMTప్రముఖ టెన్నీస్ స్టార్ సానియామీర్జా తనకు నచ్చిన పనులే చేస్తారని - ఎవ్వరేమనుకున్నా ఆమె తన వైఖరిని మార్చుకోదనే అభిప్రాయం మరోసారి రుజువైంది. అందేంటి అలా డిసైడైపోయారు అంటారా. నిజమే. ఏ విషయంలోనైనా ఆమె అంతే. గతంలో పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొంటే తప్పేముందని మీడియాతో వ్యాఖ్యానించింది. అంతేకాదు, పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉండాలనే వాళ్లను పూర్తిగా సమర్థించింది కూడా . అప్పట్లో ఆమె వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కొందరు మహిళలు తీవ్ర విమర్శలు చేశారు. మరికొందరు ఘాటుగా వ్యాఖ్యానించారు కూడా. అయినా ఆమె తన మాటను తప్పని ఏనాడూ ఒప్పుకోలేదు.
ఈ ఒక్క విషయంలోనే కాదు - తన పెళ్లి విషయంలోనూ ఆమె తన పంతానికే ప్రాధాన్యం ఇచ్చారు. పాక్ కి చెందిన షోయబ్ మాలిక్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇక, తాజా విషయానికి వచ్చే సరికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరూ అడగకపోయినా.. తెలంగాణ రాష్ట్రానికి సానియాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు. అంతటితో ఆగకుండా కోటి రూపాయలు చొప్పున రెండు సార్లు ముట్టజెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె తెలంగాణకు ఏం చేశారనేదే ప్రశ్న. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఏ ఒక్కదానికీ ఆమె పాల్గొనలేదు. అటు కేసీఆర్ కూడా ఆమెను ఒత్తిడి చేయలేదు.
ఇటీవల కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన హరిత హారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని హుకుం జారీ చేశారు. అయినప్పటికీ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో సానియా ఏమాత్రమూ స్పందించలేదు. అయితే, సాధారణ ప్రజలు ఊరుకుంటారా? సామాజిక మాధ్యమాల్లో ఏకిపారేశారు. రెండు కోట్లు తీసుకుని కూడా మౌనంగా ఉన్నావేంటమ్మా అని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. దీంతో కొద్దిగా చలించిన సానియా ఏదో ఓ మూల ఓ చిన్న మొక్క నాటుతున్న ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. మమ అనిపించారు. ఇదీ బ్రాండ్ గారి హరిత హారం. దీనికోసమే సీఎం కేసీఆర్ అంత ముచ్చటపడి కోట్లు సమర్పించింది. ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.