Begin typing your search above and press return to search.
పన్ను ఎగ్గొట్టిన సానియా మీర్జా
By: Tupaki Desk | 9 Feb 2017 5:49 AM GMTవేల కోట్లు ఎగ్గొట్టే విదేశాలకు పారిపోయే వాళ్లను ఏమీ చేయరు. కానీ సామాన్యుడు కొన్ని వేల రూపాయలు పన్ను ఎగ్గొట్టితే అతడి భరతం పట్టేస్తారు మన అధికారులు. పెద్దోళ్లు ఎన్ని తప్పులు చేసినా చెల్లిపోతుంటాయి. వాళ్ల భాగోతాలు ఏవైనా బయటికి వచ్చినా.. సైలెంటుగా.. సాఫ్ట్ గా వాటిని సెటిల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎప్పుడో కానీ.. వారి తప్పిదాలు బయటికి రావు. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పన్ను ఎగ్గొడుతున్న సంగతి కొంచెం ఆలస్యంగా బయట పడింది. ఆమె భారీ స్థాయిలో సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సి ఉందట. దీనికి సంబంధించి పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో అధికారులు సీరియస్ అయ్యారు.
చాలా కాలం నుంచి సర్వీస్ ట్యాక్స్ కట్టనందుకు ఈ నెల 16న తమ ముందు హాజరు కావాలంటూ సానియా మీర్జాకు హైదరాబాద్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు నోటీసులిచ్చారు. ఆ రోజు వ్యక్తిగతంగా వచ్చి.. లేదా తన ప్రతినిధిని పంపడం ద్వారా కానీ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు సానియా నోటీసులు జారీ చేశారు. 16న తమ ముందు హాజరై సరైన డాక్యుమెంట్లు సమర్పించని పక్షంలో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఐతే సానియా దేనికి సంబంధించి.. ఎంత పన్ను ఎగ్గొట్టిందన్నది అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొనలేదు. దీనిపై సానియా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/