Begin typing your search above and press return to search.
ఈ పోస్టు పెట్టకుంటే ఏమవుతుంది సానియా? ఆ రోజు మాత్రం మాయమైపోతుందట
By: Tupaki Desk | 18 Oct 2021 5:23 AM GMTతోపు సెలబ్రిటీలు చిన్న చిన్న లాజిక్కులు ఎందుకు మిస్ అవుతారు? అన్నది అస్సలు అర్థం కాదు. వేటిని షేర్ చేసుకోవాలో.. వేటిని చేసుకోకూడదన్న దానిపై విచక్షణ ఎలా మిస్ అవుతుంది? అన్నది ప్రశ్న. ఒక అంశం వివాదానికి కారణమవుతుందన్నప్పుడు.. దానికి దూరంగా ఉంటే ఏమవుతుంది? ఫలానా రోజున ఇష్యూ సెన్సిటివ్ గా ఉంటుంది. అందుకే.. ఆ రోజు మాత్రం మాయమైపోవాలని డిసైడ్ అయ్యా? అని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? అన్నది అసలు ప్రశ్న. తాజాగా ఇలాంటి పనే చేసి తిట్టించుకునేలా చేస్తున్నారు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.
టీ20 వరల్డ్ కప్ ఈ నెల 18న (ఈ రోజు)షురు కావటం..ఈ టోర్నీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాక్ మధ్య మ్యాచ్ 24న జరగనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ వేళలో.. ఇరు దేశాలకు చెందిన వారు ఎవరి జట్టును వారు ప్రోత్సహించుకోవటం తెలిసిందే. ఇలాంటివేళలో.. పాకిస్థాన్ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ భారతీయులు పెళ్లాడి ఉంటే.. వారికి ఉండే తిప్పలు అన్ని ఇన్ని కావు.
ఎవరు గెలిచినా.. ఓడినా.. వీరి స్పందన కోసం చూస్తారు. చిన్న తేడా వచ్చినా తిట్టిపోయటం ఖాయం. దీనికి తోడు.. ఆ సందర్భంగా ఇరు దేశాల ప్రజలు తీవ్రమైన భావోద్వేగంతో ఉండటం తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సానియా మీర్జా తాజాగా ఒక చిట్టి వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. మ్యాచ్ జరిగే వేళ.. తాను విషపూరిత వాతావరణాన్ని నివారించేందుకు సోషల్ మీడియాను ఆ రోజు వాడటం బంద్ చేస్తానని చెబుతూ పోస్టు పెట్టారు.
ఆ రోజున ఇరు దేశాల అభిమానులు తీవ్రమైన ఉద్వేగంతో ఉంటారని.. అందుకే తాను ఆ రోజున సోషల్ మీడియాలో కనిపించనని చెప్పుకున్నారు. హైఓల్టేజ్ మ్యాచ్ అన్న విషయంపై అవగాహన ఉన్నప్పుడు.. మ్యాచ్ వేళ కనిపించకుండా పోతానని చెప్పే కన్నా.. మౌనంగా ఉండిపోతే సరిపోతుంది కదా? ఇప్పుడు ఎవరికి వారు చీలి.. రెండువైపులా నెగిటివ్ వ్యాఖ్యలు వస్తే.. అనవసరమైన తలనొప్పిని చేతులారా తెచ్చి పెట్టుకున్నట్లు కదా?
ఇక.. టోర్నీ విషయానికి వస్తే.. గ్రూప్ ఏ.. గ్రూప్ బి లోని జట్ల మధ్య తొలి రౌండ్ లీగల్ మ్యాచులు మొదలవుతాయి. ఈ మ్యాచుల అనంతరం పెద్ద జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్ లు అక్టోబరు 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో అక్టోబరు 24న పాక్ తో.. అక్టోబరు 31న న్యూజిలాండ్ తో.. నవంబరు 3న అఫ్గానిస్థాన్ తో ఆడతారు. ఈ మ్యాచులన్ని ఆయా రోజున రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. పాక్ జట్టులో సానియా భర్త షోయబ్ మాలిక్ కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నీలో భారత్ ను పాక్ నిలువరించిన సందర్భం ఒక్కటి కూడా లేదు.