Begin typing your search above and press return to search.

సానియా మీర్జాకు దేశ ద్రోహం వ‌ర్తించ‌దా?

By:  Tupaki Desk   |   15 Nov 2021 8:30 AM GMT
సానియా మీర్జాకు దేశ ద్రోహం వ‌ర్తించ‌దా?
X
`దేశ ద్రోహం`.. చాన్నాళ్ల త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఈ ప‌దం తెర‌మీద‌కి వ‌చ్చింది. ఇటీవ‌ల కాలంలో బాలీవుడ్ క‌థానాయ‌కి.. కంగ‌నా ర‌నౌత్‌.. చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. 2014 త‌ర్వాతే.. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిందని ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై కొన్ని వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఆమెను దేశ‌ద్రోహిగా ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నం చేశాయి. అయితే.. ఆమె మాత్రం దూకుడు త‌గ్గించ‌క‌పోగా.. మ‌రింత‌గా విజృంభించారు. బ్రిటీష్ పాల‌న‌లో జ‌రిగిన ఘోరాల‌కు.. అప్ప‌టి పాల‌కులు.. దేశాధినేత‌లు.. అనుస‌రించిన విధానాల‌కు ఎవ‌రు బాధ్యుల‌ని ప్ర‌శ్నిస్తూ.. మ‌రోసారి ఇన్ స్టా వేదిక‌గా కామెంట్లు కుమ్మ‌రించారు.

కంగ‌నా వ్య‌వ‌హారం ఒక‌వైపు.. ర‌గులుతున్న క్ర‌మంలోనే.. మ‌రో స‌రికొత్త వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. హైదరాబాదీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పై కొంద‌రు ర‌గిలిపోతున్నారు. ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌డుతున్నారు. తాజాగా జ‌రిగిన టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌పంచ క్రికెట్‌లో పాకిస్థాన్ వ‌ర్సెస్ ఆస్టేలియా దేశాల జ‌ట్లు మ‌ధ్య హోరా హోరీ పోరు సాగిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు హాజ‌రైన సానియా.. పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఆమె పాకిస్థాన్ కోడ‌లే అయిన‌ప్ప‌టికీ.. భార‌త్‌లో పుట్టి పెరిగి.. ఈ దేశం నుంచి ఎన్నో పొందిన ఆమె.. భార‌త్‌కు బ‌ద్ధ శ‌తృవైన పాకిస్థాన్‌కు ఎలా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌.

ప్ర‌స్తుతం భార‌త పౌర‌స‌త్వం ఉండ‌డ‌మే కాదు.. భార‌త్ త‌ర‌ఫునే ఆమె టెన్నిస్ క్రీడా మైదానంలోకి దిగుతున్నారు. అలాంటి సానియా మీర్జా.. పాకిస్థాన్ విజ‌యం సాధించాలంటూ.. పేర్కొన‌డం.. మ‌ద్ద‌తుగా మాట్లాడ‌డం వంటి.. అంశాలు.. తీవ్ర విమ‌ర్శ‌లకు దారితీస్తోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు విశ్లేష‌కులు సైతం.. ``సానియా భార‌త్ నుంచి ఎన్నో విధాల ల‌బ్ధి పొందుతోంది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించి.. ఇప్పుడు పాక్‌ను పొగ‌డ‌డం, ఆ దేశానికి మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఏంటి?`` అని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. అలాంటి ఆమెకు దేశ ద్రోహం వ‌ర్తించ‌దా? అని కూడా నిల‌దీస్తున్నారు.

వాస్త‌వానికి సానియా ఇప్పుడే కాదు. గ‌తంలో క‌రోనా స‌మ‌యంలోనూ పాకిస్థాన్ కు.. అత్యంత గోప్యంగా రూ.10 కోట్ల వ‌ర‌కు సాయం అందించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే. దీనిపై నిగ్గు తేల్చేందుకు ఇటు భార‌త్ కానీ.. దీనిపై స్పందించేందుకు సానియా కానీ.. పాక్ ప్ర‌భుత్వం కానీ.. ముందుకు రాలేదు. అయితే.. ప్ర‌ధాన మీడియా కూడా దీనిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. మ‌రి దీని వెనుక ఏం జ‌రిగిందో ఇప్ప‌టికీ.. ర‌హ‌స్యంగానే ఉంది.

ఇప్పుడు ఏకంగా.. పాకిస్థాన్ కు బ‌హిరంగ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం.. సానియా చుట్టూ.. మ‌రిన్ని వివాదాలు చుట్టుముట్టేలా చేసింది. ప్ర‌స్తుతం భార‌త్-పాకిస్థాన్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత క్షీణించాయి. ఈ నేప‌థ్యంలో సానియా ఆదేశానికి మ‌ద్ద‌తు వ్య‌వ‌హ‌రించ‌డం.. ఏంట‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఇవ‌న్నీ.. దేశ ద్రోహం కింద రావా? అనే ప్ర‌శ్న‌లు.. నెటిజ‌న్ల నుంచి కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్ర‌బుత్వం మాత్రం దీనిపై నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి నెటిజ‌న్లు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర హోం మంత్రి ఏం స‌మాధానం చెబుతారో చూడాలి. అస‌లు ఆయ‌న ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? అనేది కూడా కీల‌కంగా మారింది.