Begin typing your search above and press return to search.

ఆన్‌లైన్ మోసం మాయ‌: మాజీ ప‌్ర‌ధాని స‌ల‌హాదారుడికే సైబ‌ర్ నేర‌గాళ్ల టోక‌రా

By:  Tupaki Desk   |   29 Jun 2020 4:30 PM GMT
ఆన్‌లైన్ మోసం మాయ‌: మాజీ ప‌్ర‌ధాని స‌ల‌హాదారుడికే సైబ‌ర్ నేర‌గాళ్ల టోక‌రా
X
ఇంట్లో కూర్చుని ద‌ర్జాగా కొంద‌రు భారీగా సంపాదిస్తున్న ప‌రిస్థితులు సాంకేతిక ప‌రిజ్ఞానం తీసుకువ‌చ్చింది. కొన్ని ట్రిక్కులు.. అవ‌గాహ‌న లేమిని వీరు పావులుగా చేసుకుని ద‌ర్జాగా సంపాదించేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ షాపింగ్ భారీగా పెరిగింది. ఇంట్లోనే కూర్చుని మ‌న‌కు కావాల్సిన వ‌స్తువులు, స‌రుకులు తెచ్చుకుంటున్నాం. ఈ క్ర‌మంలో ఆన్‌లైన్‌లో వివ‌రాల న‌మోదు స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా లేకుంటే మ‌న జేబుకు చిల్లు ప‌డ్డ‌ట్టే. ఆ విధంగా అప్ర‌మ‌త్తంగా లేక‌పోవ‌డంతో సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌ముఖులు ఎంద‌రో ఆన్‌లైన్ మోసాల బారిన ప‌డుతున్నారు. తాజాగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు ఆన్‌లైన్ మోస‌గాళ్ల చేతికి చిక్కారు. ఈ సంఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగింది.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న స‌మ‌యంలో మీడియా సలహాదారుగా సంజయ్ బారు ప‌ని చేశారు. ఆయ‌న తెలుగు వారే. వైర‌స్ వ్యాప్తి ఢిల్లీలో తీవ్రంగా ఉండ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో మ‌ద్యం విక్ర‌యాలు మొద‌లుపెట్టింది. దీంతో ఆయ‌న ఆన్‌లైన్‌లో మ‌ద్యం కోసం వెతికారు. లా కేవ్ వైన్స్ అండ్ స్పిరిట్స్ పేరుతో ఓ షాపులో మద్యం దొరుకుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆయ‌న ఆన్‌లైన్‌లో త‌న‌కు కావాల్సిన మందును ఆర్డ‌ర్ చేసి దానికి రూ.24 వేలు చెల్లించాడు. అయితే ఎంత‌కీ మ‌ద్యం డెలివ‌రీ కాలేదు. ఈ క్ర‌మంలో ఆన్‌లైన్‌లో మద్యం కోసం ఒక నంబ‌ర్ వ‌స్తే ఫోన్ చేశారు. మొద‌ట స్విచ్ఛాఫ్ అయ్యింది. డబ్బులు ట్రాన్స్‌ఫర్ కాగానే సెల్ స్విచాఫ్ అని స‌మాచారం వ‌చ్చింది. దీంతో మ‌రోసారి ప్ర‌య‌త్నించాడు. మ‌ళ్లీ అదే స‌మాధానం. ఈ విధంగా చాలాసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ వ‌స్తోంది. దీంతో సంజయ్ బారు తాను మోస‌పోయాన‌ని గుర్తించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఆయ‌న‌కు వ‌చ్చిన మొబైల్ నంబరును ట్రేస్ చేశారు. ఆ నంబ‌ర్ ఓ క్యాబ్ డ్రైవర్ ది అని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచార‌ణ‌లో పోలీసులకు షాక్ గుర‌య్యేలా కొన్ని విష‌యాలు తెలిశాయి. ఈ విధంగా ఆన్‌లైన్ మోసాల బారిన‌ సామాన్యుల‌తో పాటు ప్ర‌ముఖులు కూడా ప‌డుతున్నారు. అందుకే ఒక‌టికి రెండు సార్లు కంపెనీ వివ‌రాలు.. ఆర్డ‌ర్‌.. ఆర్డ‌ర్ చేస్తే వారి ఫోన్ నంబ‌ర్ వంటివి స‌క్ర‌మంగా తెలుసుకుని ఆర్డ‌ర్ చేయాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. అవ‌న్నీ వ‌దిలేసి క్యాష్ ఆన్ డెలివ‌రీ ఆప్ష‌న్ పెట్టుకుంటే చాలా మంచిద‌ని చెబుతున్నారు.