Begin typing your search above and press return to search.
సంజూ మాట.. నిన్న రాత్రంతా నిద్రలేదు
By: Tupaki Desk | 25 Feb 2016 10:54 AM GMTబందీగా ఉన్నపుడే తెలుస్తుంది స్వాతంత్ర్యం విలువ ఏంటన్నది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఇది బాగానే అనుభవమైనట్లుంది. మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాడు సంజూ. ఈ రోజే జైలు నుంచి విడులైన దత్.. అసలు బయటికి వస్తున్నానన్న ఆనందంలో తనకు నిన్న రాత్రంతా నిద్రే పట్టలేదని చెప్పాడు. జైలు నుంచి ఇంటికి చేరుకున్నాక మీడియా సమావేశం పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు సంజూ. అతనేమన్నాడంటే...
‘‘జైలు నుంచి బయటకు వస్తున్నానన్న ఆనందం.. ఇక మళ్లీ లోపలకు రావల్సిన అవసరం లేదన్న భావనతో చాలా ఉద్వేగంగా అనిపించింది. అందుకే బుధవారం రాత్రంతా నేను తిండి సరిగా తినలేదు.. నిద్ర కూడా పోలేదు. ఇన్నాళ్లకు నాకు స్వాతంత్ర్యం లభించింది. ఐతే ఇప్పటికీ ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నా. ఇప్పుడు కూడా ఏదో పెరోల్ మీద బయటకు వచ్చినట్లే అనిపిస్తోంది. ఈ సమయంలో నాకు నా తండ్రి బాగా గుర్తుకొస్తున్నారు. ఆయన ఉంటే చాలా సంతోషించేవారు’’ అని దత్ అన్నాడు. ఆ సందర్భంగా పైకి చూస్తూ సంజూ.. ‘‘నాన్నా.. నేను బయటకు వచ్చేశాను’’ అన్నాడు.
తాను భారతీయుడినైనందుకు గర్వపడుతున్నానని.. శిక్ష విధించే సమయంలో కూడా తాను ఉగ్రవాదిని కాననే కోర్టు చెప్పిందని.. ఆ రోజు చాలా సంతోషంగా అనిపించిందని సంజయ్ దత్ ఉద్వేగంగా చెప్పాడు. సెలబ్రిటీని కాబట్టి పెరోల్ వచ్చిందనో.. ముందుగా విడుదల చేశారనో అనుకోవడం తప్పని.. నిజంగానే తన సత్ప్రవర్తన కారణంగా నిర్ణయం తీసుకున్నారని సజంయ్ అన్నాడు. మాన్యత తన బెటర్ హాఫ్ కాదు.. బెస్ట్ హాఫ్ అని సంజయ్ కితాబిచ్చాడు. మాన్యత, పిల్లలతో కలిసి సంజయ్ ఫొటోలకు పోజిచ్చి తన ఆనందాన్ని పంచుకున్నాడు.