Begin typing your search above and press return to search.
హీరోగారి మద్దతు ఈ సారి చెల్లెలికే, వేరే వాళ్లకు కాదు!
By: Tupaki Desk | 8 April 2019 4:48 PM GMTతన రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీ నేతగా నిలబడ్డాడు సునీల్ దత్. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అప్పట్లో ఎంపీగా పని చేశారు. కాంగ్రెస్ నేతగా ఆయన తుదిశ్వాస విడిచారు. సునీల్ దత్ మరణం అనంతరం ఆయన కూతురు ప్రియ కాంగ్రెస్ పార్టీలో నేతగా మారారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఆమె కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సారి ఎంపీగా కూడా అయ్యారామె.
సునీల్ దత్ కూతురు కాంగ్రెస్ తరఫున అలా ఎంపీగా వ్యవహరించినా, ఆ లెజెండరీ నటుడి తనయుడు సంజయ్ దత్ మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లలేదు. సంజయ్ దత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంత యాక్టివ్ గా రాలేదు కానీ.. కొంతకాలం అయితే సమాజ్ వాదీ పార్టీ తరఫున పని చేశాడు. ఆ పార్టీ తరఫున దత్ కు ఎంపీటికెట్ కూడా దక్కింది ఒక సారి. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో దత్ ఆ ఎన్నికల నుంచి తప్పుకున్నారు.
ఇక ప్రియ మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున నేతగా కొనసాగుతూ ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆమె ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రచార పర్వంలో సంజయ్ దత్ పాల్గొంటున్నాడు. తన సోదరిని ఎంపీగా గెలిపించేందుకు దత్ ప్రచారం మొదలుపెట్టాడు. గతంలో ఆమె కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడు అటు వైపు చూడని సంజయ్ దత్ ఇప్పుడు.. మాత్రం సోదరి గెలుపు కోసం కృషి చేస్తున్నట్టుగా ఉన్నాడు.