Begin typing your search above and press return to search.
లోక్ సభ ఎన్నికల బరిలో స్టార్ హీరో
By: Tupaki Desk | 16 March 2019 8:28 AM GMT2004లో కాంగ్రెస్ హయాంలో ప్రఖ్యాత బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తండ్రి దివంగత సునీల్ దత్ కేంద్రంలో యువజన, క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వారి కుటుంబం నుంచి సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ ఎన్నికల్లో పోటీ చేసి సక్సెస్ ఫుల్ పార్లమెంట్ సభ్యురాలిగా నిరూపించుకున్నారు. ఇప్పుడు 2019 ఎన్నికల వేళ సంజయ్ దత్ కూడా రాజకీయాల్లోకి రావడానికి అడుగులు వేస్తున్నారు. తన కుటుంబం దారిలోనే నడవడానికి సిద్ధమయ్యారు.
2019 సార్వత్రిక ఎన్నికల వేళ.. సంజయ్ దత్ ఇప్పుడు రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమవుతున్నారు. ఘజియా బాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసేందుకు రెడీ అయ్యారు. ఘజియాబాద్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత కుమార్ విశ్వాస్ గత ఎన్నికల్లో గెలిచారు. అయితే సంజయ్ దత్ రాజకీయాల్లో పోటపడడం ఇదే మొదటి సారి కాదు.. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని సంజయ్ దత్ అప్పట్లో పేర్కొని రాజకీయాలకు దూరంగా జరిగారు.
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కుమార్ విశ్వాస్ కాంగ్రెస్ తరుఫున ఘజియా బాద్ పార్లమెంట్ స్థానంపై మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఈయనకు పోటీగా ఎస్పీ-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా సంజయ్ దత్ నిలబడుతున్నారు. సంజయ్ దత్ రాజకీయాలకు కొత్త కాదని.. ఈసారి అతన్ని 100శాతం గెలిపించుకుంటామని ఆయన అభిమానులు బలంగా చెబుతున్నారు. మరి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంజయ్ దత్ పొలిటికల్ కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో వేచి చూద్దాం..