Begin typing your search above and press return to search.
సంజయ్ దత్.. పెద్ద షాకిచ్చాడే
By: Tupaki Desk | 8 Feb 2017 12:45 PM GMTసంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ మనిషిగానే ఉన్నారు. ఆ పార్టీ నుంచే ఎంపీగా కూడా గెలిచారు. ఐతే సంజయ్ దత్ మాత్రం ఆశ్చర్యకరంగా భారతీయ జనతా పార్టీలో చేరేలా కనిపిస్తున్నాడు. అతడి తీరు చూస్తుంటే త్వరలోనే భాజపా తీర్థం పుచ్చుకునేలా కనిపిస్తున్నాడు.
మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఐదో తారీఖున దిందోషీలో బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి సంజయ్ హాజరు కావడమే ఈ ఊహాగానాలకు తావిస్తోంది. ఆ కార్యక్రమంలో భాజపా కండువా కప్పుకుని హల్ చల్ చేశాడు సంజయ్ దత్. భాజపా యువజన విభాగం నాయకుడు మోహిత్ కాంబోజ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంజయ్ దత్ తో పాటు పెద్ద ఎత్తున అతడి సహచరులు పాల్గొనడం విశేషం. ఏదో మామూలు అతిథిలాగా సంజూ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు కనిపించలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంబోజ్ ను గెలిపించాలని స్థానిక ఓటర్లను సంజయ్ అనుచరులు కోరడం విశేషం.
సంజూ గతంలో పుణెలోని ఎరవాడ జైల్లో ఉండగా.. అతడికి నిబంధనలకు విరుద్ధంగా పలుమార్లు పెరోల్ లభించేలా చేయడంలో భాజపా నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని అంచనా వేసి.. భాజపాలో చేరడానికి సంజూ మొగ్గుచూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ ప్రచారాన్ని భాజపా నేతలు ఖండించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/