Begin typing your search above and press return to search.
మోడీని తిట్టి అడ్డంగా బుక్ అయిన కాంగ్రెస్ నేత!
By: Tupaki Desk | 13 Sep 2018 6:33 AM GMTకాంగ్రెస్ నేతల తెలివి తెల్లారినట్లుంది. ప్రధాని మోడీపై విమర్శలు చేయటానికి.. విరుచుకుపడటానికి బోలెడన్ని అంశాలున్న వేళ.. వాటిని వదిలేసి.. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తెస్తున్న తీరు ఇప్పుడు వివాదంగా మారింది. ప్రధాని మోడీని ఉద్దేశించి పామరుడు అంటూ ముంబయి కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి.
మోడీ జీవితంపై మహారాష్ట్ర ప్రభుత్వం షార్ట్ ఫిలిం తీసి రాష్ట్రంలోని పాఠశాల్లో ప్రదర్శించటాన్ని ఆయన తప్పుపట్టారు. తాజాగా ముంబయిలో జరిగిన ఒక మీడియా మీట్ లో మాట్లాడుతూ.. బలవంతంగా మోడీ సినిమాను ప్రదర్శించటం తప్పు అని.. ఇలాంటి రాజకీయాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలన్నారు.
మోడీ లాంటి చదువుకోని.. నిరక్షరాస్యుడైన వ్యక్తి జీవితంపై సినిమా చూసి విద్యార్థులు ఏం నేర్చుకుంటారంటూ నోరు పారేసుకున్నారు.మోడీకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయన్నది విద్యార్థులకు.. ప్రజలకు తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. తమ ముఖ్యనేత మోడీపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సంజయ్ ఒక పిచ్చివాడిగా వారు అభివర్ణిస్తున్నారు.
ప్రధాని మోడీని 125 కోట్ల మంది భారతీయులు ఎన్నుకున్నారని.. ఆ విషయాన్ని ఆయన మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు. ప్రజలంతా సంజయ్ మాదిరి తెలివితక్కువ వాళ్లు కాదన్నారు. కాంగ్రెస్ నేతలకు ఒక సిద్దాంతం అంటూ లేదని.. కనీసం ఎలాంటి ప్రశ్నలు వేయాలో కూడా వాళ్లకు తెలీదని మండిపడ్డారు.