Begin typing your search above and press return to search.
అధినేత లైట్ తీసుకున్నారని లాగి ఒక్కటిచ్చింది
By: Tupaki Desk | 4 April 2017 4:29 AM GMTదేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా.. ఆమ్ ఆద్మీ పార్టీ తీరే వేరు. పేరుకు పొలిటికల్ పార్టీగా చెప్పుకునే ఈ పార్టీలో నిత్యం ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది. చెప్పే ఆదర్శాలకు.. ఆ పార్టీలో చోటు చేసుకునే పరిణామాలకు పొంతనే ఉండదు. అధినేత మొదలు.. ఆ పార్టీ నేతలపై తరచూ ఏదో ఒక ఆరోపణ.. వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలవేళ.. అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఎన్నికల బరిలో నిలుచోవాలని భావించిన ఒక మహిళా కార్యకర్తను.. ఆ పార్టీకి చెందిన నేత లంచం అడగటం పెను సంచలనానికి దారి తీసింది. కమిట్ మెంట్ తో పార్టీకి పని చేస్తున్న తనను లంచం అడుగుతారా? అంటూ శివాలెత్తిన సదరు మహిళా నేత.. పార్టీకి చెందిన ముఖ్యనేతల్లో ఒకరైన సంజయ్ సింగ్ చెంపను ఓపెన్ గా చెళ్లుమనిపించారు.
అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేషన్‌కు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంజయ్ సింగ్ చెంపను ఒక మహిళా కార్యకర్త లాగి పెట్టి పీకటమే కాదు.. అతడి అంతు చూస్తానంటూ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం పార్టీ నేతలకు షాకింగ్ గా మారింది. ఇంతకీ.. అలా ఎందుకు చేశారన్న ప్రశ్నకు.. సదరు మహిళా కార్యకర్త సమాధానమిస్తూ.. తాను ఎన్నికల్లో నిలుచునేందుకు అవకాశం ఇవ్వాలని కోరానని.. కానీ.. తనను లంచం అడిగారని.. కావాలంటే అందుకు సంబంధించిన ఆడియో రికార్డు కూడా తన దగ్గర ఉందని ఆమె చెబుతున్నారు.
అంతేకాదు.. టికెట్ కేటాయింపునకు పార్టీ నేత సంజయ్ సింగ్ లంచం అడిగిన వైనాన్ని.. పార్టీ అధినేత కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లానని.. కానీ.. ఆయన తన మాటను నమ్మలేదన్నారు. అందుకే తాను చెంప చెళ్లుమనిపించానని చెప్పుకొచ్చారీ ఫైర్ బ్రాండ్. ఈ ఘటనను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఖండించారు. ఇలాంటి దాడులు తమ విజయవకాశాల్ని దెబ్బ తీయలేవని చెబుతున్నారు. కాన్ఫిడెన్స్ ఉండటం తప్పేం కాదు కానీ.. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/