Begin typing your search above and press return to search.

దేశ ప్రజల కరోనా మూడ్ ను ఐపీఎల్ మార్చగలదు

By:  Tupaki Desk   |   7 May 2020 5:30 PM GMT
దేశ ప్రజల కరోనా మూడ్ ను ఐపీఎల్ మార్చగలదు
X
కరోనా భయంతో దేశ ప్రజలంతా భయంతో బిగుసుకుపోయారు. ఇప్పుడు లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమయ్యారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. దేశ ప్రజల మానసిక స్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఎంజాయ్ చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్చగలదని యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారుడిగా సాధ్యమైనంతగా తొందరగా ఆటలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుకుంటున్నారని శాంసన్ చెప్పుకొచ్చాడు. అప్పుడే ప్రజలకు కాస్త రిలీఫ్ దొరుకుతుందని.. మనసు సరైన దారిలో ఉంటుందని తెలిపాడు.

8 ఏళ్లుగా ప్రతీ సంవత్సరం ఈ సమయంలో ఐపీఎల్ ఆడేవాడినని.. ఈ సంవత్సరంకరోనాతో ఖాళీగా ఉండడం బాదేస్తోందని సంజూ శాంసన్ తెలిపారు. అందుకే తొందరగా ఆటలు మళ్లీ ప్రారంభం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అధికారుల సూచనలు గౌరవిస్తూ మ్యాచ్ లు ఆడుతామన్నారు. దేశ ప్రజల మూడ్ ను ఐపీఎల్ మారుస్తుందని.. త్వరగా మొదలుపెట్టండని కోరాడు.

రాహుల్ ద్రావిడ్ తన ఆట చూసి రాజస్థాన్ రాయల్స్ లో అవకాశం ఇచ్చాడని.. అతడి ప్రోత్సాహం మరువలేనిదని సంజూ శాంసన్ అన్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదన్నాడు.

కరోనా లాక్ డౌన్ తో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభమై మేలో ముగిసేది. కానీ బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. టోర్నీ ఎప్పుడు జరుగుతుందో.? ఈ సంవత్సరం జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.