Begin typing your search above and press return to search.
భారతీయులపై మెర్సిడెస్ బెంజ్ వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్
By: Tupaki Desk | 29 Nov 2022 3:02 PM GMTడబ్బు నిర్వహణలో భారతీయులు చాలా మంది పొదుపు పాటిస్తారు. దీనికి గాను ప్రపంచవ్యాప్తంగా భారతీయుల తీరును అనేక మంది ప్రశంసిస్తారు. తమతోపాటు తరువాతి తరాల కోసం కూడా డబ్బును పొదుపు చేయడం భారతీయులకు అలవాటు.. తాజాగా దీనిపై మెర్సిడేజ్ బెంజ్ ఇండియా సేల్స్ మార్కెటింగ్ హెడ్ సంతోష్ అయ్యర్ భారతీయులపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా బలహీనమైన సామాజిక భద్రతా చర్యల కారణంగానే భారతదేశం బలమైన పొదుపు మనస్తత్వాన్ని కలిగి ఉందని మెర్సిడెస్ బెంచ్ ఇండియా హెడ్ వ్యాఖ్యానించారు. భారతీయులు తమతోపాటు భవిష్యత్ తరాలకు పొదుపు చేస్తారని అన్నారు. చాలా మంది భారతీయులకు, విలాస వస్తువులపై ఖర్చు చేయడం కంటే పొదుపు ప్రాధాన్యతనిస్తారని.. గణనీయమైన పునర్వినియోగపరచదగిన ఆదాయం ఉన్నవారు కూడా ఇలానే చేస్తారని అన్నారు.
లగ్జరీ కార్ల గురించి ప్రతీనెల 15000 మంది ఆరాతీస్తున్నప్పటికీ చివరగా కేవలం 1500 మంది మాత్రమే తమ బెంజ్ కార్లు కొంటున్నారని..మిగిలిన వారు తమ కోరికను వాయిదా వేసుకుంటున్నారని ఆక్ష్న అన్నారు. ఇలా వాయిదా వేసుకుంటున్న వారిలో ఎక్కువమంది నెలవారి వాయిదాలు తక్కువ ఉంటున్న కార్లనే కొంటున్నారని ఎద్దేవా చేశారు. మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. అలా పరోక్షంగా భారతీయుల పొదుపు తత్వాన్ని మెర్సిడెస్ బెంజ్ హెడ్ తప్పుపట్టారు.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ హెడ్ సంతోష్ అయ్యర్ చేసిన కామెంట్స్ నెటిజన్లు ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆర్థిక స్వేచ్ఛను అవమానించేలా మాట్లాడారని వారంతా మండిపడుతున్నారు. మెర్సిడెస్ కారు కోసం తమను, తమ పిల్లల భవిష్యత్తును పక్కనపెట్టాలని కోరుకుంటున్నావా? అని నెటిజన్లు ప్రశ్నించారు.
విలాసవంతమైన కొనుగోళ్లు మరియు పొదుపుల మధ్య సారూప్యతపై ట్విట్టర్‌లో అనేక వ్యతిరేకతను మెర్సిడెస్ ఎదుర్కొంటోంది. అనుభవజ్ఞులైన ఆర్థికవేత్తలు తమ వ్యాఖ్యలతో మెర్సిడెస్ తీరును ఎండగడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.