Begin typing your search above and press return to search.

సారా టెండూల్కర్‌ నైట్‌ డేట్ సస్పెన్స్ వీడింది

By:  Tupaki Desk   |   6 Dec 2021 7:45 AM GMT
సారా టెండూల్కర్‌ నైట్‌ డేట్ సస్పెన్స్ వీడింది
X
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసు నుండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె జోరు స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గదు అనడంలో సందేహం లేదు.

సోషల్‌ మీడియాలో ఆమె హాట్ ఫొటో షూట్స్‌ మరియు వీడియోలు చూస్తూ ఉంటే ముందు ముందు ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతో ఏమైనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సారా టెండూల్కర్‌ గత కొంత కాలంగా టీం ఇండియా క్రికెటర్ శుభమన్ గిల్ తో ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్లు నిజమేనేమో అన్నట్లుగా వారిద్దరు సోషల్ మీడియా ద్వారా ముచ్చటించుకోవడం జరిగుతూ ఉంటుంది.

వీరిద్దరి మద్య వ్యవహారం చాలా దూరం వెళ్లిందని.. పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటీవల శుభమన్ గిల్ ఏంజిల్స్ తో ప్రేమలో పడకూడదు అంటూ ఒక చిన్న కొటేషన్ తో ఉన్న టీ షర్ట్ ను ధరించడం వల్ల అసలేం జరిగింది అంటూ మళ్లీ చర్చ మొదలు అయ్యింది.

వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారా అంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది. ఈ నేపథ్యంలో సారా టెండూల్కర్‌ డేట్ నైట్‌ కు ఒక వ్యక్తి చేయి పట్టుకుని వెళ్తున్న ఫొటోలను షేర్‌ చేసింది. ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని ఆమె చెప్పలేదు. శుభమన్ గిల్ టెస్టు సిరీస్ లో ఉన్నాడు. కనుక అది శుభమన్ కాదు. కనుక సారా కొత్త ప్రియుడు అయ్యి ఉంటాడని కొందరు భావించారు.

సారా షేర్ చేసిన ఆ ఫొటోల సస్పెన్స్ క్లియర్‌ చేస్తూ సింగర్‌ కనిక కపూర్ ఆ పోస్ట్‌ ను షేర్‌ చేసింది. దాంతో సారాతో నైట్ డేట్‌ కు వెళ్లింది ఆ సింగర్ అని తేలిపోయింది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో అసలు ఎవరు అంటూ అంతా కూడా చాలా ఆసక్తిని కనబర్చారు. మొత్తానికి సారా టెండూల్కర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోల సస్పెన్స్ కు తెర తీసినట్లయ్యింది. పెద్ద ఎత్తున ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. డేట్‌ కు వెళ్లిన సారా చాలా మోడ్రన్‌ లుక్ లో హాట్ గా కనిపించి ఆకట్టుకుంది.