Begin typing your search above and press return to search.

శివసేన కు షాక్.. మోడీ తో పవార్ భేటి..

By:  Tupaki Desk   |   20 Nov 2019 7:08 AM GMT
శివసేన కు షాక్.. మోడీ తో పవార్ భేటి..
X
మహారాష్ట్ర రాజకీయం కొత్త మలుపుతిరిగింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ పార్టీ కి స్పష్టమైన మెజార్టీ రాక పోవడంతో రాష్ట్రపతి పాలనకు దారితీసిన సంగతి తెలిసిందే.. శివసేన-బీజేపీ కలిసి పోటీచేశాయి. అయితే శివసేన 50కు పైగా సీట్లు సాధించడం.. బీజేపీ భారీగా సీట్లు కోల్పోవడం తో శివసేన ప్లేట్ ఫిరాయించింది. సీఎం సీటును పంచుకుందామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..

దీంతో శివసేన, బీజేపీ కూటములు విడిపోయాయి. ఇక శివసేన చివరి వరకు ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు కు విఫలయత్నం చేసింది. అయితే కప్పెల తక్కెడగా మారిన మహారాష్ట్ర రాజకీయం లో బుధవారం కీలక మలుపు చోటు చేసుకుంది.

థ్రిల్లర్ ను తలపించిన మహారాష్ట్ర ఎపిసోడ్ లో ఈరోజు కీలక పరిణామం జరిగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధానిమంత్రి నరేంద్రమోడీతో ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు భేటి అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన దృష్ట్యా అక్కడ ప్రభుత్వ ఏర్పాటు కోసమే వీరి భేటి జరగబోతోందని సమాచారం.

శివసేన తో పొత్తును ఎన్సీపీ, కాంగ్రెస్ విరమించుకోవడంతో మహారాష్ట్ర రాజకీయం మలుపుతిరిగింది.ఇప్పుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మోడీతో భేటి కానుండడంతో మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటుపై అంచనాలు నెలకొంటున్నాయి. ఈ పరిణామం శివసేన కు షాకింగ్ లా మారింది.

అయితే మహారాష్ట్ర లోని రైతుల సమస్యలపై మాత్రమే శరద్ పవార్ భేటి అవుతున్నారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. శివసేన తో తెగతెంపులు చేసుకున్న పవార్ సడన్ గా ఇలా మోడీ తో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.