Begin typing your search above and press return to search.
అతడు సినిమా ను గుర్తు కు తెచ్చిన శరద్ పవార్
By: Tupaki Desk | 23 Nov 2019 2:54 PM GMTతెలుగు సినీ పరిశ్రమ లో...పాపులర్ మూవీల్లో ఒకటైన అతడు గుర్తుంది కదా? నిబంధనలను పేర్కొంటూ నాజర్- తనికెళ్ల భరణి మధ్య ఓ ఆసక్తి కర సంభాషణ. పొలాన్ని అక్రమంగా తన పేరును చేయించుకున్న భరణి పై నాజర్ మండి పడుతూ..పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటాడు. దానికి తనికెళ్ల భరణి స్పందిస్తూ.."మీరు 1957 మోడల్ కారే వాడుతున్నారని అనుకున్నాడు. బ్రెయిన్ కూడా ఆ మోడల్ వాడుతున్నారు. మీరు ఇప్పుడు ఎస్సై దగ్గర కు వెళ్లి కలుస్తారు. నేను నిన్నే వెళ్లి పదివేలు ఇచ్చాను" అంటాడు. సరిగ్గా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎన్‌సీపీ-శివసేన మీటింగ్ జరిగింది. కానీ మొన్నే..పార్లమెంటులో పవార్‌ను సెటిల్ చేశారు ప్రధానమంత్రి .
మహారాష్ట్ర లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమి గద్దెనెక్కేందుకు సిద్ధమయ్యాయని, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. శనివారం మరోసారి చర్చించిన అనంతరం మూడు పార్టీల ప్రతినిధులు సంయుక్తంగా మీడియాకు వివరాలు వెల్లడించనున్నారని వివరించారు. ఎడతెరపి లేకుండా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని, ఎన్‌సీపీ-శివసేన సర్కారు ఏర్పడనుందని అంతా అనుకున్నారు.
అయితే, దీనికంటే ముందే...ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సెటల్ చేసేశారు. ఇటీవల రాజ్యసభలో 250వ సెషన్ సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎన్సీపీ పార్టీని మెచ్చుకున్నారు. శరద్ పవార్‌కు చెందిన ఆ పార్టీ గత సమావేశాల్లో ఎటువంటి అల్లరి చేయలేదన్నారు. వెల్‌లోకి దూసుకువెళ్లకుండానే.. తమ డిమాండ్లను తీర్చుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఎన్సీపీ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిదని మోదీ అన్నారు. ఆ తర్వాత రోజే ప్రధాని మోదీ, శరద్ పవార్‌లు భేటీ అయ్యారు. దీని గురించి పవార్ స్పందిస్తూ.... కేవలం రైతుల సమస్యల గురించి మాట్లాడినట్లు తెలిపారు. కానీ ఈ సమావేశంలోనే...శరద్ పవార్ తో ప్రభుత్వ ఏర్పాటు డీల్ కుదిరినట్లు సమాచారం.