Begin typing your search above and press return to search.

సంచలనాల సారా.. అనూహ్య రిటైర్మెంట్

By:  Tupaki Desk   |   28 Sep 2019 4:58 AM GMT
సంచలనాల సారా.. అనూహ్య రిటైర్మెంట్
X
సినీనటులు.. సెలబ్రిటీలు.. క్రీడాకారులు కొందరికి అనూహ్యంగా ఇమేజ్ వస్తుంది. కొందరికి తమ రంగంలో రాణించినందుకు పేరు వస్తే.. మరికొందరికి తాము చేసే పనుల కారణంగా వారంటే విపరీతమైన క్రేజ్ ప్రజల్లో ఉంటుంది. ఒకవైపు ఆటతో మరో వైపు తన చేతలతో కోట్లాదిమందిని అభిమానులుగా చేసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ మహిళా జట్టు కీపర్ సారా టేలర్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ మధ్యన నగ్నచిత్రంతో హాట్ టాపిక్ గా మారిన ఆమె.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించి తేరుకోలేని రీతిలో షాకిచ్చారు.

తన ఆటతో పలువురు అభిమానుల్ని సంపాదించుకున్న ఆ ఆగ్రశ్రేణి క్రికెటర్.. ఇటీవల కీపర్ గా తన నగ్న చిత్రాన్ని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయటం పెను సంచలనంగా మారింది. అయితే.. పేరు ప్రతిష్ఠల కోసమో.. సంచలనాల కోసమో కాక.. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే క్యాంపెయిన్ లో భాగస్వామి అయ్యేందుకు ఆమె ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నట్లుగా చెప్పారు.

శారీరకంగా తాను చాలా సమస్యల్ని ఎదుర్కొన్నానని.. కొన్నింటిని అధిగమించినట్లుగా వెల్లడించిన ఆమె.. మహిళల శారీరక సమస్యలపై అవగాహన కల్పించేందుకే తానీ న్యూడ్ ఫోటో షూట్ చేసినట్లు చెప్పుకున్నారు. ఉమెన్స్ హెల్త్ యూకే చేసిన వినతి మేరకే ఆమె ఈ న్యూడ్ ఫోటోషూట్ కు ఓకే చేశారు. ఆమె చేసిన పనికి ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే..తాజాగా ఆమె తన ఆటకు గుడ్ బై చెప్పారు. ఎగ్జైంటీ రుగ్మతతో బాధ పడుతున్న ఆమె.. తానిక క్రికెట్ ను ఆడలేనని చెబుతూ.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. 30 ఏళ్ల సారా 2006లో ఇంగ్లండ్ జట్టు తరఫున తన కెరీర్ ను షురూచేసింది.

మూడు ఫార్మాట్ల క్రికెట్ లో 226 మ్యాచులు ఆడిన ఆమె.. మహిళా క్రికెట్ లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగారు. ఇంగ్లండ్ మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా సారాకు పేరుంది. మూడు ఫార్మాట్లలో కలిపి మరెవరికీ సాధ్యం కాని రీతిలో 232 మందిని ఔట్ చేసిన ఆమె.. బ్యాటింగులోనూ పరుగుల వరద పారించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 6533 పరుగుల్ని చేసింది. ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న ఆమె.. క్రికెట్ ను ఎంజాయ్ చేయలేకపోతుందని.. దీంతో ఆమె తన రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించటంతో ఆమె అభిమానులకు దిమ్మ తిరిగే షాకిచ్చినట్లైంది.

తాను కఠిన నిర్ణయాన్ని తీసుకున్నానని.. ఇదే అందుకు సరైన సమయంగా సారా పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా ఉత్తమ క్రీడాకారులతో కలిసి సాధించిన విజయాలతో తాను గర్వంగా ఉన్నానని.. తన ఆరోగ్య కారణాలతో ఆటను వదిలేందుకు ఇదే సరైన టైంగా తాను భావిస్తున్నట్లు వెల్లడించింది. ఇంగ్లాండ్ జెర్సీతో ప్రతి క్షణాన్ని అస్వాదించానని.. తనను ప్రోత్సహించినందుకు అందరికి ధన్యవాదాలంటూ ఆటకు గుడ్ బై చెబుతూ.. ట్వీట్ చేశారు.