Begin typing your search above and press return to search.
తమిళ రాజకీయంలో అనూహ్య ట్విస్ట్
By: Tupaki Desk | 4 Feb 2018 9:03 AM GMTతమిళనాడు రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే అధినేత్రి తర్వాత కొత్త రాజకీయ వేదికలు తెరమీదకు రాగా...తాజాగా ఇప్పటికే ఉన్న ఇద్దరు ముఖ్యనేతల వేదికలు ఏకతాటిపైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్ కుమార్ - నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తాము కలిసి పనిచేయనున్నామని వారిద్దరూ ప్రకటించారు. అగ్ర కథానాయకులు రజనీకాంత్ - కమలహాసన్ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో వారిని వ్యతిరేకించేవారిగా పేరుండటం కాకుండా...ఆ ఇద్దరిలాగే...సినిమా పరిశ్రమకు చెందిన శరత్ కుమార్ - సీమాన్ చేతులు కలపడం చర్చనీయాంశంగా మారింది.
మదురై విమానాశ్రయంలో శరత్ కుమార్ - సీమాన్ ఉమ్మడిగా విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తమ భేటీ జరిగిందని - భవిష్యత్తులో ఈ తరహా భేటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్రంలో శక్తివంతమైన నేతగా ఉన్న జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పలు సమస్యలు ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. తమిళనాడు ప్రయోజనాల దృష్ట్యా పలు సమస్యలపై తామిద్దరూ కలిసి పనిచేయనున్నామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. వైద్య - విద్యా రంగాలను ప్రైవేటీకరించి విద్యార్థులకు ఉచిత బస్సు ఛార్జీలను ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆమోదించబోమని కోరారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి ప్రాజెక్టు లేదని - వ్యక్తిగత ఆదాయ గరిష్ట పరిమితిని పెంచకపోవడం బాధాకరమని శరత్ కుమార్ - సీమాన్ అన్నారు. నాలుగేళ్లలో రైతులకు ఎలాంటి సాయం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయలేదని, ఇక మిగిలిన ఏడాదిలోనూ చేసేదేమీ ఉండదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వైద్య బీమా రూ.5 లక్షలు అమలు సాధ్యకాదని అభిప్రాయపడ్డారు. దేశంలో 50 కోట్లపైగా జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని పేర్కొంటూ..వారికి తగిన న్యాయం చేసేలా కార్యక్రమాలు ఉండాలన్నారు.