Begin typing your search above and press return to search.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నాడట ... ఎవరు చెప్పారంటే !
By: Tupaki Desk | 3 Nov 2020 1:30 PM GMTపాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి ఈ మధ్య అసలు ఏది కలిసి రావడంలేదు. కరోనా , ఇతర కారణాలతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి, తీవ్ర వాదంతో దేశమంతా అతలాకుతలమవుతున్న తరుణంలో పదవి నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షం నుంచే గాక అధికార పక్షం నుంచి కూడా ఇమ్రాన్ పై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇదిలా కొనసాగుతుండగా ఇమ్రాన్ ఖాన్ కు కొత్తగా మరో చిక్కు వచ్చి పడింది. ఇమ్రాన్ కి బాగా సన్నిహితుడైన వ్యక్తి, ఆయన క్రికెట్ ఆడే సమయంలో సహచరుడిగా ఉన్న సర్ఫరాజ్ నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఓ డ్రగ్ అడిక్ట్ అంటూ ఆరోపణలు చేశాడు.
1987 లో ఇమ్రాన్ కొకైన్ తీసుకోవడాన్ని తాను కళ్లారా చూశానని ఓ వీడియో లో చెప్పాడు. 1970, 1980 ప్రాంతాల్లో నవాజ్, ఇమ్రాన్ ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లు. నవాజ్ కూడా మంచి ఫాస్ట్ బౌలర్ తను చెప్పింది అబధ్ధమైతే ఇమ్రాన్ తనను కోర్టుక లాగొచ్చు అని అన్నాడు. 1987 లో పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సరిగా బౌలింగ్ వేయలేయపోయిన ఇమ్రాన్, ఇస్లామాబాద్ లోని తన ఇంటికి వచ్చి, కొకైన్ తీసుకున్నాడని సర్ ఫరాజ్ గుర్తు చేశాడు. పైగా లండన్ లో కూడా ఆయన డ్రగ్స్ తీసుకోవడాన్ని మొహిసిన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, సలీం మాలిక్ కూడా చూశారని ఆ మాజీ బౌలర్ చెప్పాడు.
ఇలా డ్రగ్స్ తీసుకోవడం ఆయనకు అదే కొత్త కాదని లండన్ తో పాటు తన ముందు కూడా చాలాసార్లు డ్రగ్స్ తీసుకోవడం తాను కళ్లారా చూశానని చెప్పారు. కొకైన్ వంటి పదార్థాన్ని ఆయన పీల్చడం తాము చాలాసార్లు చూశామని చెప్పారు. తాను చెప్పింది అక్షర సత్యం అని నవాజ్ స్పష్టం చేశారు. ఒక వేళ తాను చెప్పేది తప్పని తేలితే, దేనికైనా సిద్ధమని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను తన ఎదురుగా తీసుకువస్తే అసలు విషయం బయటపెడతానని చెప్పారు. ఈ విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ గనక ఖండించాలనుకుంటే తన ఎదురుగుండా వచ్చి ఖండించాలని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకొనే సమయంలో చూసింది తానొక్కడే కాదని.. అందుకు లండన్ లో చాలా మంది సాక్ష్యులున్నారని నవాజ్ అన్నారు.