Begin typing your search above and press return to search.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఇండియాదే!

By:  Tupaki Desk   |   17 Jun 2017 11:44 AM GMT
ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఇండియాదే!
X
సాధార‌ణంగా మ‌న బంధువులెవ‌రైనా ఓ జట్టు త‌ర‌పున ఆడుతుంటే ఆ జ‌ట్టే గెల‌వాల‌ని కోరుకుంటాం. అందులోనూ ఆ బంధువు జ‌ట్టు కెప్టెన్ అయితే? ఇంక చెప్పేదేముంది... పూర్తి మ‌ద్ద‌తు అత‌డికే. కానీ, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ స‌ర్ఫ‌రాజ్ మేనమామ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు. ఆదివారం జ‌ర‌గ‌బోయే ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో టీమిండియా క‌చ్చితంగా గెలుస్తుంద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతున్నారు.

ఆదివారం ఇండియా-పాకిస్థాన్‌ ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ నేప‌థ్యంలో పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ మేనమామ మెహబూబ్ హసన్ వ్యాఖ్య‌లు సంచల‌నం రేపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో టీమిండియా త‌ప్ప‌క విజయం సాధిస్తుందని ఆయ‌న నొక్కి వ‌క్కాణిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ కు ఓటమి తప్పదని తేల్చేశారు. సొంత మేన‌మామే దాయాది జ‌ట్టుకు మ‌ద్ద‌తు తెల‌ప‌డం స‌ర్ఫ‌రాజ్ కు చేదు వార్తే!

సర్ఫరాజ్ తల్లి ఆక్విలా బనోకి మెహబూబ్ హాసన్ స్వయానా సోదరుడు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఇత్వాలో వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో క్లర్క్ గా పని చేస్తున్నారు. షకీల్ అహ్మద్ తో వివాహం జరిగిన అనంతరం సర్ఫరాజ్ తల్లి కరాచీకి వెళ్లిపోయింది. 2015లో కరాచీలో జరిగిన సర్ఫరాజ్ పెళ్లికి హాసన్ వెళ్లారు

త‌న‌ పిల్లలు కూడా భారత్ కే మద్దతిస్తారని హ‌స‌న్ తెల‌ప‌డం విశేషం. తన మేనల్లుడు ఆడుతున్నాడని ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని ఆయ‌న అన్నారు. అత‌డి జట్టు తరపున అతడు ఆడుతున్నాడన్నారు. టీమిండియాతో పాక్ జట్టును పోల్చలేమని, క‌చ్చితంగా ట్రోఫీ భారత్ దే న‌ని తేల్చేశారు. మేన‌మామ వ్యాఖ్య‌ల‌ను స‌ర్ఫ‌రాజ్ విధంగా తీసుకుంటాడో వేచి చూడాల్సిందే!.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/