Begin typing your search above and press return to search.

21 ఏళ్ల తర్వాత భారత్ కు బ్యూటీ కిరీటాన్ని తెచ్చింది

By:  Tupaki Desk   |   19 Dec 2022 5:33 AM
21 ఏళ్ల తర్వాత భారత్ కు బ్యూటీ కిరీటాన్ని తెచ్చింది
X
అందాల పోటీలో కిరీటాన్ని దక్కించుకోవటం మాటలు చెప్పినంత ఈజీ కాదు. దానికి బోలెడన్ని దశలు దాటాలి. కఠిన పరీక్షల్ని ఎదుర్కోవాలి. మానసికంగా ఎంతో బలంగా ఉండాలి. అందానికి అందం మాత్రమే కాదు.. అంతకు మించి అన్నట్లుగా అన్ని ఉండాలి. అప్పుడు మాత్రమే కీర్తి కిరీటం సొంతమవుతుంది. తాజాగా మిసెస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది భారత్ కు చెందిన సర్గమ్ కౌశల్.

ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాలకు చెందిన ముద్దుగుమ్మలతో పోటీ పడుతూ.. మిసెస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ముంబయికి చెందిన ఈ బ్యూటీ. అమెరికాలోని వెస్ట్ గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన పోటీల్లో ఆమె విజయాన్ని సొంతం చేసుకున్నారు. సర్గమ్ విజేతగా నిలవగా.. మొదటి రన్నరప్ గా మిసెస్ పోలినేసియా.. రెండో రన్నరప్ గా మిసెస్ కెనడా నిలిచారు.

ఈ టైటిల్ మరోసారి భారత్ సొంతం కావటానికి ఏకంగా 21 ఏళ్లు పట్టటం విశేషం. 1984 నుంచి నిర్వహిస్తున్న మిసెస్ వరల్డ్ పోటీల్లో తొలిసారి భారత్ అందం మెరిసింది 2001లో. అప్పట్లో మోడల్ అదితి గోవిత్రికర్ మిసెస్ వరల్డ్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

కట్ చేస్తే.. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత సర్గమ్ పుణ్యమా అని భారత్ కు ఈ టైటిట్ దక్కింది. ఆమె నివాసం ముంబయి అయినా.. ఆమె కుటుంబానికి జమ్ముకశ్మీర్ కు చెందిన వారుగా చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.