లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్న మాజీ సీఎం
By: Tupaki Desk | 19 July 2016 6:10 PM GMTకేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే సోలార్ ప్యానల్ కుంభకోణంలో కూరుకుపోయిన ఆయన ఇపుడు లైంగిక వివాదంలో పడ్డారు. అది కూడా సోలార్ కుంభకోణంలో చాందీ పేరును వెల్లడించిన సరితా నాయర్ అనే మహిళ వల్లే కావడం ఆసక్తికరం. సీఎం చాందీ సహా మరోమరో ముగ్గురు లైంగికంగా తనను వాడుకున్నారని సంచనల ఆరోపణలు చేశారు.
కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోలార్ కుంభకోణం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 70 కోట్ల సోలార్ కుంభకోణానికి సంబంధించి 13 మంది రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కాం కారణంగానే చాందీ ఓడిపోయారనే చర్చ కూడా ఉంది. ఈ క్రమంలో సరితా నాయర్ దాఖలు చేసిన చీటింగ్ కేసు ఫిర్యాదుపై కోయంబత్తూరు కోర్టుకు ఆమె విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సరితా మీడియాతో మాట్లాడుతూ సీఎంపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా కేరళ మాజీ ఆర్థిక మంత్రి పళని మాణిక్యంపై కూడా లైంగిక వేధింపుల విమర్శలను చేశారు. ఓ ఐటీ కేసులో మాణిక్యం లంచం డిమాండ్ చేయడమే కాకుండా తనను లైంగికంగా వేధించారన్నారు. సీఎం - ఆర్థిక మంత్రితో పాటు మరో ముగ్గురు తనను వేధించారని మీడియాతో సరిత పేర్కొంది.
ఇదిలాఉండగా సోలార్ స్కాంతో తెరమీదకు వచ్చిన సరిత తన జీవితంలో జరిగిన ఘటనలన్నింటినీ ప్రపంచానికి తెలియజేస్తాన్నారు. తన ఆటోబయోగ్రఫీ రాయడంతో పాటు మలయాళం - తమిళంలో సినిమాలు తీస్తున్నట్లు సరితా నాయర్ తెలిపారు.