Begin typing your search above and press return to search.

కేరళ సీఎం ఆమె దగ్గర కక్కుర్తిపడ్డారా?

By:  Tupaki Desk   |   4 April 2016 7:00 AM GMT
కేరళ సీఎం ఆమె దగ్గర కక్కుర్తిపడ్డారా?
X
సోలార్ కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సరిత నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ సిఎం ఉమెన్ చాందీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన నివాసంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని ఆసియానెట్ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. అయితే ఉమెన్ చాందీని తానెప్పుడూ తండ్రిగా భావించేదానినని సరిత అన్నారు. పెరంబవూర్ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు రాసిన లేఖలోని విషయాలు అన్నీ నిజాలని తెలిపారు. అంతేకాకుండా సిఎం సహాయకులకు పలు సందర్భాల్లో రూ. 2.16 కోట్లకు పైగా నగదు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు. కాగా పెరంబవూర్ లో పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు 2013, మార్చి 19న ఆమె రాసిన లేఖలో లేఖలో సంచలనాత్మక విషయాలున్నాయి. ఊమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. చాందీ కుమారుడు తనను వేధింపులకు గురిచేశారని గతంలో ఆమె ఆరోపించారు. ఆ లేఖ తాను రాసినదేనని సరిత ధ్రువీకరించారు.

అయితే.. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనపై పథకం ప్రకారం కొత్త కుట్రకు తెరతీశారని చాందీ ఆరోపిస్తున్నారు. తన ప్రభుత్వాన్ని దించడానికి అన్ని ప్రయత్నాలు చేశారని.. చివరి అస్త్రంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేస్తున్నారు.