Begin typing your search above and press return to search.
ఏపీలో టీచర్లకు, స్కూల్ విద్యార్థులకు షాకిచ్చిన సర్కార్
By: Tupaki Desk | 29 March 2022 11:30 AM GMTఏపీలో విద్యా సంస్కరణలు చేపడుతున్న వైసీపీ సర్కార్ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చి 'అమ్మఒడి'తో హాజరు శాతాన్ని పెంచుతున్న జగన్ సర్కార్ తాజాగా విద్యార్థులు, టీచర్లకు షాకిచ్చింది. వాళ్లు ఠంచనుగా పాఠశాలకు హాజరయ్యేలా సరికొత్త యాప్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ యాప్ లు త్వరలోనే పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.
ఏపీలో విద్యా సంస్కరణల తీసుకొచ్చిన జగన్ సర్కార్ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. విద్యార్థులను భారీగా స్కూళ్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వారి హాజరును ఖచ్చితంగా నమోదు చేసేందుకు దారులు వెతుకుతోంది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకుంటోంది.
ఏపీ స్కూళ్లలో టీచర్లకు ఇకపై హాజరు నమోదు చేసేందుకు మొబైల్ యాప్ లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు రకాల యాప్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వీటి ప్రయోగం ప్రారంభమైంది.
ఇవాళ్లి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో, ఎల్లుండి నుంచి అనంతపురంలో, ఏప్రిల్ 1 నుంచి ప్రకాశంలో ఈ యాప్ లను ప్రయోగాత్మకంగా పరీక్షించబోతున్నారు. అక్కడ వచ్చే ఫలితా ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా యాప్ లను అమలు చేస్తారు.
టీచర్లకు ఇచ్చే మొబైల్ యాప్ ద్వారా టీచర్లతో పాటు విద్యార్థుల హాజరు కూడా నమోదు చేయబోతున్నారు. ఇప్పటివరకూ మ్యాన్యువల్ గా అటెండెన్స్ రిజిస్ట్రర్ ద్వారా హాజరు నమోదు అయ్యేది. ఇకపై యాప్ ల ద్వారా వీరి హాజరు నమోదు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఈ యాప్ లను స్కూళ్లో ఓపెన్ చేసి హాజరు నమోదు చేస్తేనే నమోదయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా టీచర్లు ఇంటి వద్ద నుంచి హాజరు నమోదు చేయకుండా ప్రభుత్వం వారికి గట్టి షాకిచ్చినట్టైంది. టీచర్లు కూడా తమ మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా విద్యార్థుల ఫొటోలు తీసి ఓసారి అప్ లోడ్ చేస్తారు. రోజూ ఫేస్ మాస్కింగ్ ద్వారా హాజరు నమోదు చేస్తారు. జూన్ నుంచే వచ్చే విద్యాసంవత్సరంలో దీన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆన్ లైన్ హాజరు వల్ల విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా స్కూళ్లకు హాజరు కావాలి. తప్పించుకోవడానికి వీలుండదు.