Begin typing your search above and press return to search.
హామీల చిట్టాను బాండ్ పేపర్ రాసి మరీ పంచినా.. ఓడించారే?
By: Tupaki Desk | 22 Feb 2021 4:45 AM GMTరోటీన్ గా చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో కానీ.. వినూత్నంగా ప్రయత్నించిన ఒక రాజకీయ నేతకు చివరకు ఓటమి తప్పలేదు. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఏం చేసైనా సరే.. వారి మనసుల్ని గెలుచుకొని ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆలోచనలో ఉంటే.. మరికొందరు వినూత్నంగా ప్రయోగాలు చేస్తున్నారు.
అలాంటి ప్రయోగాల్లో అందరిని ఆకర్షించింది తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. సర్పంచితో పాటు ఏడు వార్డులకు సంబంధించిన గ్రామ ఎన్నికల్లో తాము గెలిస్తే చేసే పనుల గురించి బాండ్ పేపర్ మీద రాయటమే కాదు.. దానికి నోటరీ చేయించటం.. వార్డుపెద్దలకు అప్పజెప్పి.. తమను గెలిపించాలని కోరటం వినూత్న ప్రయత్నంగా అనిపించింది.
అయితే.. ఊబలంక పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారు గ్రామస్తులు. బాండ్ పేపర్ రాసిచ్చిన వైసీపీ అభ్యర్థికి బదులుగా.. ఆయనకు పోటీగా బరిలోకి దిగిన వైసీపీ రెబెల్ అభ్యర్థి 287 ఓట్ల వ్యత్యాసంతో గెలిచిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. బాండ్ పేపర్ ప్లాన్ తో భారీగా వర్కువుట్ అవుతుందని భావిస్తే.. అందుకు భిన్నంగా గ్రామస్తులు ఇచ్చిన తీర్పుతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఓటరన్న అంటే మాటలా? అన్న భావన కలిగేలా చేస్తున్నారని చెప్పక తప్పదు.