Begin typing your search above and press return to search.

ఈ నేతకున్న దమ్ము మన నాయకులకుందా?

By:  Tupaki Desk   |   30 Jan 2019 8:45 AM GMT
ఈ నేతకున్న దమ్ము మన నాయకులకుందా?
X
గెలువకు ముందు హామీలివ్వడం.. గెలిచాక ఓటరు ముఖం చూడకపోవడం నేటి నేతల ట్రెండ్.. నీతిగా.. నిజాయితీగా వెళ్తామంటే ప్రస్తుత పరిస్థితుల్లో కుదరదు.. ప్రలోభాలు, తప్పుడు హామీలతో గద్దెనెక్కడం.. ఆ తర్వాత ప్రజల ఆశలను వమ్ము చేయడం నేటి నేతలకు అలవాటే.. తెలుగు రాష్ట్రాల సీఎంల నుంచి మన ఎమ్మెల్యేల వరకూ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవు.

అయితే పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఓ అభ్యర్థి హామీలు అమలు చేయకపోయినా.. అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నా.. వాటిని ప్రజల పరం చేస్తానని హామీ ఇస్తున్నాడు. అంతేకాదు బాండ్ పేపర్ మీద రాసి మరీ పంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచాడు. ఈ దమ్ము ధైర్యంగల నేత తాను ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచనని.. నిజాయితీ గెలిపించండని.. పనులు చేయడానికి ప్రజల దగ్గర ఒక్క రూపాయి కూడా చేయి చాచనని ప్రతిన బూనాడు.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పోటీచేస్తున్న మహిళా అభ్యర్థి రమణమ్మ బాండ్ పేపర్ మీద గ్రామస్థులకు హామీలు రాసి ఇచ్చి మరీ పోటీలో నిలబడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

చెర్వుఅన్నారం గ్రామం ఈ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.దీంతో భర్తకు బదులుగా రమణమ్మ రంగంలోకి దిగారు. సర్పంచ్ గా గెలిస్తే ప్రజలకు సేవ చేస్తానని.. ఆస్తులు పెంచుకున్నా.. అక్రమంగా సంపాదించినా గ్రామస్థులంతా కలిసి తన ఆస్తుల్ని జప్తు చేసుకోవచ్చంటూ 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ పోటీలో నిలిచింది. మరి ఇలాంటి నీతి, నిజాయితీగా ఉండే నేతను ఆ గ్రామస్థులు గెలిపిస్తారా.? ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మన ఎమ్మెల్యేలు, సీఎంలు ఇలాంటి సాహసం చేస్తే బావుండు అని గ్రామస్థులు ఆశపడుతున్నారు.