Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌: సర్వేపై స‌స్పెన్ష‌న్ వేటు...కాంగ్రెస్ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   6 Jan 2019 10:39 AM GMT
బ్రేకింగ్‌: సర్వేపై స‌స్పెన్ష‌న్ వేటు...కాంగ్రెస్ సంచ‌ల‌నం
X
కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. సమీక్ష సమావేశంలో ఐసీసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యాదర్శి ఆర్.సి కుంతియా, పీసీసీ అధ్యక్షుడిపై సర్వే సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

ఓ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పై సర్వే దాడికి పాల్పడ్డారని, అంతే కాకుండా సమావేశంలో సంబంధంలేని అంశాలు మాట్లాడుతూ నేతలను నిందించార‌ని, ఈ సమావేశంలోనే స‌ర్వే ఘ‌ర్షణకు దిగార‌ని పేర్కొంటూ....వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని అధిష్టానం ఆదేశాల మేరకు సర్వేను క్రమశిక్షణ కమిటీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనేక సార్లు సర్వే సత్యనారాయణకు పార్టీ లో ప్రాధాన్యత ఇచ్చి, పదవులు ఇచ్చినా, సమావేశంలో ఆయన పార్టీ నాయకత్వం పట్ల వ్యవహరించిన తీరు స‌రికాద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ వెల్ల‌డించింది.

కాగా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. 2004 సిద్దిపేట నుంచి ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్వే.. 2009 లో మల్కాజిగిరి పార్లమెంట్ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీ గెలిచారు. కేంద్రంలో జాతీయ రహదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మల్కాజిగిరి జనరల్ స్థానంగా మార‌డంతో అక్క‌డి నుంచే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2015 వరంగల్ ఎస్సీ స్థానం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కంటోన్మెంట్ పాలక వర్గం ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ కొడుకు, కూతురు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో సర్వే సత్యరాయణ కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.