Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫ్యామిలీని తిట్టేసి..హరీశ్ ని పొగిడేశాడు
By: Tupaki Desk | 14 April 2017 10:52 AM ISTపవర్ లో ఉన్నప్పుడు చెలరేగిపోవటం.. పవర్ లో లేనప్పుడు కామ్ గా ఉండటం కొంతమంది రాజకీయ నేతలకు అలవాటు. అలాంటి తీరు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ పార్టీ నేతలు పవర్ లో ఉన్నప్పుడు ఎంతలా చెలరేగిపోతారో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందుకు బిన్నంగా ఉండిపోతారు. దీనికి ఏ నేతా సూటిగా సమాధానం చెప్పరు. ఇదే తరహాలో కనిపిస్తారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యానారాయణ. యూపీఏ హయాంలో ఆయనెంత చురుగ్గా కనిపించే వారో తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిన తర్వాత సైలెంట్ అయిన సర్వే.. అంతకు ముందు ఎలా ఉండేవారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా తనదైన శైలిలో వ్యాఖ్యానించి అందరి దృష్టిని ఆకర్షించారు. విభజించి పాలించే సూత్రాన్ని పర్ పెక్ట్ గా అప్లై చేసిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావును ప్లాట్ చేసేలా ప్రశంసలతో ముంచెత్తారు. మంత్రి హరీశ్ రావు ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారంలో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. కుమార్తె అవినీతికి పాల్పడుతూ మంత్రి హరీశ్ ను ఒంటరిని చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీ పాలనకు బుద్ది చెప్పే వరకూ ప్రజలు నిద్రపోరన్న ఆయన.. మంత్రి హరీశ్ ను మాత్రం అందుకు భిన్నంగా వెనకేసుకురావటం గమనార్హం.
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకున్నా.. తన మాటలతో వారిని మోసగిస్తున్నారన్న సర్వే.. కేసీఆర్ కు మాదిగలంటే చులకన.. చిన్నచూపు అంటూ మండిపడ్డారు. తప్పుడు హామీలతో మోసగిస్తున్నారంటూ ఆరోపించిన ఆయన.. 2019 ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. హరీశ్ నేతృత్వంలో నిర్వహిస్తున్న మిషన్ కాకతీయలో భారీ అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. వాటికి భిన్నంగా సర్వే స్పందించటం గమనార్హం. కేటీఆర్.. కవితలు అవినీతికి పాల్పడుతున్నారన్న సర్వే.. హరీశ్‌విషయంలో అందుకు భిన్నంగా రియాక్ట్ కావటం అందరి దృష్టిని ఆకట్టుకునేలా చేస్తుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/