Begin typing your search above and press return to search.
కమలం గూటికి ఆ కాంగ్రెస్ సీనియర్?
By: Tupaki Desk | 27 March 2021 12:00 PM GMTకాంగ్రెస్ పార్టీలో తలపండిన ఆ సీనియర్ నేత చూపు ఇప్పుడు బీజేపీ వైపు పడిందా? కాంగ్రెస్ లో ఉంటే ఇక కష్టమే అని డిసైడ్ అయ్యాడా? అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్ లో హవా చూపించిన ఆయన ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యాడని.. చడీ చప్పుడు లేకుండా ఉన్న ఆయన బీజేపీలో చేరాలని చూస్తున్నాడని ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న సర్వే సత్యనారాయణ ఈ మధ్య కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ప్రచారంలో అసలే పాల్గొనలేదు. ఆయన అప్పట్లోనే పార్టీ మారుతారని ప్రచారం సాగినా.. ఆయన అల్లుడు మాత్రం టీఆర్ఎస్ లో చేరినా ఆయన ముందుకు సాగలేదు.
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ సర్వేతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , మాజీ ఎంపీ వివేక్ తదితరులు వచ్చి కలిశారు. బీజేపీలో చేరాలని కోరారు. కొన్ని ముఖ్యమైన అంశాలపై క్లారిటీ కోసం ఆయన ఎదురుచూస్తున్నారని.. బీజేపీలో చేరేందుకే సమయం అడిగారని అంటున్నారు.
అయితే అటు బీజేపీలో చేరలేక.. ఇటు కాంగ్రెస్ లో ఉండలేక ఆయన ఇప్పుడు ఆగిపోయినట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ ను కనుసైగలతో శాసించిన సర్వే సత్యానారాయణ కిందటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలేదు. అయితే టీపీసీసీ కోసం సర్వే ప్రయత్నిస్తున్నారని.. సోనియమ్మ కరుణిస్తే తీసుకుంటారని.. లేదంటే బీజేపీలో చేరిపోతారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా ప్రచారం సాగుతోంది. త్వరలోనే సర్వే తన రాజకీయ భవిష్యత్ కోసం నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.