Begin typing your search above and press return to search.
కేసీఆర్ తో కుమ్మక్కు..ఉత్తమ్ వల్లే భార్య ఓడిపోయింది
By: Tupaki Desk | 7 Jan 2019 12:11 PM GMTతెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా - పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. గాంధీభవన్‌లో మల్కాజ్ గిరి కాంగ్రెస్ పార్టీ సమీక్షలో కుంతియాను ఉద్దేశించి సర్వే అసభ్యకరంగా మాట్లాడారని...పీసీసీ కార్యదర్శిని వాటర్ బాటిల్ తో తనపై సర్వే దాడి చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ ఆరోపణలు, తనపై సస్పెన్షన్ వేటుపై సర్వే స్పందించారు. నన్ను పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ పరంగా తెలియదని, మీడియా ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. తను వాస్తవాలు ప్రశ్నిస్తే వేటు వేస్తారా..అని ఆయన వ్యాఖ్యానించారు.
ఉత్తమ్ ,కుంతియాల ఆధ్వర్యంలోనే పార్టీ ఓడిందని సర్వే సత్యనారాయణ పునరుద్ఘాటించారు. ``ఓటమికి కారణమైన వారే సమీక్షలు ఎలా చేస్తారని నేను అడిగా. ఉత్తమ్ తూతూ మంత్రంగా మీటింగ్‌లు పెట్టి పీసీసీ - సీఎల్పీ కావాలని చూస్తున్నారు. నేనొక దళిత బిడ్డను..సోనియా దయతో ఎంపీగా గెలిచా. నా ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు. నన్ను సస్పెండ్ చేసే అధికారం వీళ్లకు లేదు. సోనియా -రాహుల్ - ఆంటోని ఆ నిర్ణయం తీసుకోవాలి`` అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో టికెట్లు అమ్ముకుంటారని, ఓడిన తర్వాత సమీక్షలు చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఓటమికి నైతిక భాధ్యత వహిస్తూ ఉత్తమ్ - కుంతియా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబానికి విధేయుడినని పేర్కొంటూ పార్టీ మారబోనని అన్నారు. తాను సీఎం సీటుకు పోటీ అవుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడించారని సర్వే వ్యాఖ్యానించారు. ``ఉత్తమ్ ..డబ్బులు వసూల్ చేశారు. టీఆర్ఎస్‌తో ఉత్తమ్ ఫిక్సింగ్ అయ్యారు`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారని సర్వే కితాబిచ్చారు. గెలిచామని కేసీఆర్ - కేటీఆర్ లు వారెక్కడా జల్సాలు చేయడం లేదు. కేసీఆర్ వంద మీటింగ్ లు పెడితే ..వీళ్ళు ఇండ్లకు పరిమితం అయ్యారు. కేసీఆర్ ప్రజల్లో ఉంటే.. ఈ నేతలు హోటల్‌కు పరిమితమయ్యారు. ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ తరఫున పోటీ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డికి ఎలా ఉత్తమ్ మద్దతిచ్చారు ? ఇలా చేయడం టీడీపీకి మిత్రద్రోహం చేయడం కాదా ? తాండూర్ లో డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చారు. ఇంకా సీఎల్పీ మీకేనా .సీఎల్పీ అయినా దళితుడికి ఇవ్వరా .?ఉత్తమ్ తప్పిదాల వలననే ఆయన భార్య ఓడింది . ఉత్తమ్ పై సీబీసీఐడీ కేసు ఉంది ..అందుకే కేసీఆర్ తో కుమ్మక్కయ్యారు. నేను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ను ..నాలాగా చాలామంది ఇంకా పార్టీలో ఉన్నారు`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.